స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన నాగశౌర్య: ‘వరుడు కావలెను’ నుంచి సర్‌ప్రైజింగ్ వీడియో

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు లవర్ బాయ్ నాగశౌర్య. మొదటి చిత్రంతోనే నటుడిగా మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటు డీసెంట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడికి వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఒకదాని తర్వాత ఒకటి అలా ఇరవై సినిమాలు ఏకధాటిగా చేసుకుంటూ వచ్చాడు. అయితే, ఇందులో సరైన హిట్లు మాత్రం పెద్దగా దక్కలేదు. ఇక, ఇటీవల 'అశ్వద్ధామ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన నాగశౌర్య.. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం నాగశౌర్య నటిస్తోన్న చిత్రాల్లో 'వరుడు కావలెను' ఒకటి. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు అమ్మాయి రీతూ వర్మ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. దీపావళి సందర్భంగా టైటిల్‌ ప్రకటిస్తూ సినిమా టీజర్‌ విడుదల చేశారు. అందులో హీరో హీరోయిన్లు ఇద్దర్నీ పరిచయం చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

Naga Shouryas Varudu Kaavalenu Look Video Released

ఇక, శుక్రవారం హీరో నాగశౌర్య పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీనిని పురస్కరించుకుని 'వరుడు కావలెను' చిత్ర యూనిట్ ఓ స్పెషల్ మీడియోను విడుదల చేసింది. ఇందులో హీరో లుక్‌ను ప్రధానంగా చూపించారు. సిక్స్ ప్యాక్ బాడీపై షర్ట్, దానికి సరిపోయే బ్లేజర్, మేచింగ్ వాచ్, కళ్లజోడును ధరించడాన్ని హైలైట్ చేశారు. మొత్తంగా స్టైలిష్ లుక్‌తో నడుచుకుంటూ వస్తున్న నాగశౌర్యను పరిచయం చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో నదియా, మురళీ శర్మ, 'వెన్నెల' కిశోర్‌, ప్రవీణ్‌ తదితరులు నటిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X