నడిరోడ్డుపై లవర్స్ విషయంలో సీరియస్ అయిన హీరో నాగ శౌర్య.. అలాంటి చెత్తపని చేయడంతో..
టాలీవుడ్ హీరో నాగ శౌర్య త్వరలోనే ఒక న్యూ లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పనుల్లో బిజీగా ఉండగా నాగశౌర్య అనుకోకుండా లవర్స్ కు సంబంధించిన గొడవతో వార్తల్లో నిలిచాడు. నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే సారీ చెప్పాలి అని నిలదీశాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంత హఠాత్తుగా నాగ శౌర్య ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది అనే వివరాల్లోకి వెళితే..

త్వరలోనే న్యూ మూవీ
సింపుల్ హీరోగా చాలా డీసెంట్ గా కనిపించే నాగశౌర్య ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా ఇన్ని రోజులు ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చాడు. వీలైనంతవరకు యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా లవ్ స్టోరీలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక త్వరలోనే అతని నుంచి పలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే సినిమా విడుదల కాబోతోంది.

ఆ పనుల్లో బిజీగా
రీసెంట్ గా నాగశౌర్య పెళ్లి కూడా చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పెళ్లికి సంబంధించిన పనుల్లో కూడా బిజీగా మారుతూ మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన నాగశౌర్య ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రమోషన్స్ లో కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కొత్త ప్రాజెక్ట్ పనులు కూడా చివరి దశకు చేరుకోవడంతో త్వరలోనే ఈవెంట్స్ కు కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నాడు.

నాగశౌర్య గొడవ పడుతూ
అయితే నాగశౌర్య బిజీగా ఉన్న సమయంలో హఠాత్తుగా అతనికి సంబంధించిన ఒక గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాదులోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నాగశౌర్య గొడవ పడుతూ కనిపించారు. ఇద్దరు లవర్స్ కూడా అక్కడ హైలెట్ అవడంతో ఒక్కసారిగా జనాలు మొత్తం చుట్టూ చేరిపోయారు. దీంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది.

లవర్స్ గొడవలో నాగశౌర్య
నాగ శౌర్య ఎందుకు గొడవపడ్డాడు అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ట్రాఫిక్ లో ఉండగానే గొడవపడ్డారు. అబ్బాయి ఆ అమ్మాయిని చెంప మీద కొట్టడంతో నాగశౌర్య ఒక్కసారిగా కారులో నుంచి దిగి ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు? అని వెంటనే తిరిగి క్షమాపణ చెప్పు అని వాగ్వివాదానికి దిగాడు.

లవర్ అయితే కొడతావా?
అయితే కొట్టిన వ్యక్తి ఆమె నా లవర్ అంటూ నాగశౌర్యకు సీరియస్ గా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. లవర్ అయితే కొడతావా అంటూ నాగశౌర్య కూడా కోపంగా ప్రశ్నిస్తూ అలా చేయడం చాలా తప్పు అని వెంటనే అమ్మాయికి సారీ చెప్పు అని కోపగించుకున్నాడు. ఇక చుట్టూ పక్కన వాళ్ళు కూడా నాగశౌర్యకు మద్దతు పలుకుతూ లవర్ ని అలా కొడతావా అని అడిగారు.
గొడవ వీడియో వైరల్
ఇక అతనితో గొడవ పడుతున్న నాగశౌర్యను చూసి చాలామంది వీడియోలు తీశారు. దీంతో అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక నాగ శౌర్య ఆ విధంగా చేయడం చాలా కరెక్ట్ అని.. గతంలోనే అతను అమ్మాయిలను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోను అని కూడా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











