Sreeleela పై నాగవంశీ హాట్ కామెంట్స్ వైరల్.. మహేష్ బాబు పక్కన అలా అంటూ

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. రిజల్ట్‌లను ఏమాత్రం పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే గత ఏడాదిలో 'సర్కారు వారి పాట' అనే కమర్షియల్ సినిమాతో వచ్చాడు. దీనికి ఆశించిన రీతిలో కలెక్షన్లు రాకపోయినా ఈ మూవీ ఫలితంపై మహేశ్ బాబు సంతృప్తిగా ఉన్నాడు. దీంతో ఆ వెంటనే అతడు మరో సినిమాను కూడా ప్రకటించేశాడు.

స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఈ పార్ట్ మొత్తం ఎంతో మంచిగా వచ్చినట్లు తెలిసింది. ఇక, దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను జనవరి 17 నుంచి మొదలెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత నాగవంశీ కీలక విషయాలు వెల్లడించారు.

Naga Vamsi Clarity on Mahesh Movie Release Date and Sreeleela Role

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ 'మహేశ్ - త్రివిక్రమ్ సినిమాను జనవరి 18 నుంచి పున: ప్రారంభించబోతున్నాం. అంతేకాదు, దీన్ని ఆగస్టు 11, 2023న విడుదల చేయబోతున్నాం' అంటూ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌ను చెప్పారు. అలాగే, 'ఈ మూవీలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా నటిస్తుంది. అయితే, ఆమె సెకెండ్ హీరోయిన్ కాదు. అయినా ఇందులో ఫస్ట్ సెకెండ్ అని ఎవరికీ నెంబర్లు ఇవ్వలేదు. కాబట్టి ఈ చిత్రంలో మహేశ్ బాబు గారితో ఇద్దరు హీరోయిన్లు కలిసి నటిస్తున్నారు అంతే' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఇక, ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X