బోనీతో కాంట్రవర్సీ.. జాన్వీ పేరిట సెటిల్మెంట్.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్ వైరల్
ఇప్పుడు తెలుగు సినిమా దగ్గర అదరగొడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ లో తమ మొదటి సినిమా తోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఒకామె అని చెప్పాలి. కాగా జాన్వీ కపూర్ బ్యాక్గ్రౌండ్ లో కోసం కూడా అందరికీ తెలిసిందే. అలనాటి నటి శ్రీదేవి వారసురాలిగా అటు హిందీ సినిమాలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. అలానే తెలుగు సినిమాకి వచ్చేందుకు మాత్రం చాలా సమయం తీసుకుంది.
ఇలా మొత్తానికి జాన్వీ కపూర్ తెలుగులో కూడా ఒక్క సినిమాతోనే స్టార్ అయ్యిపోయింది. కాగా జాన్వీ కుటుంబానికే వస్తే తల్లి కోసం అందరికీ తెలిసిందే. తన చెల్లెలు ఖుషి కపూర్ కూడా ఈ మధ్యనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే తన తండ్రి బోనీ కపూర్ హిందీ సినిమాలో పెద్ద నిర్మాత. మరి బోనీ కపూర్ తో ఈ మధ్యన మన తెలుగు సినిమాకి చెందిన ఒక టాప్ మోస్ట్ దర్శకుడు పెట్టుకున్న రచ్చ కోసం గుర్తుండే ఉంటుంది.

కాగా జాన్వీ కపూర్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసింది. అదే ఎన్టీఆర్ ని ఎంతో అభిమానించే యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీనే బోనీ కపూర్ తో ఆ మధ్య గట్టి వాగ్వాదమే పెట్టుకోవడం జరిగింది. మెయిన్ గా హిందీ మార్కెట్ లో పుష్ప 2 సెట్ చేసిన ఊహించని రన్ అండ్ వసూళ్లు చూసి హిందీలో చాలా మంది నిద్రపోయి ఉండరు అనే తరహా కామెంట్స్ బాలీవుడ్ బడా నిర్మాతలు చాలా మందికి కొట్టినట్టుగా అనిపించింది.
కాగా అదే మీట్ లో బోనీ కపూర్ కూడా ఉండడంతో తాను నాగవంశీతో కొంచెం హాట్ హాట్ గానే ఘాటు వ్యాఖ్యలు పరస్పరం చేసుకున్నారు. మరి దీనిపై నాగవంశీ ఇచ్చిన లేటెస్ట్ రిప్లై ఇంకా ఆసక్తిగా మారింది. కాగా అసలు బోనీ కపూర్ తో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. అంటే అక్కడ జాన్వీ కపూర్ లాంటి కూతురు ఉన్న బోనీ కపూర్ లాంటి తండ్రితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా అంటూ రెండు సార్లు తాను చెప్పడం గమనార్హం.
అంటే తాను ఏ ఉద్దేశంతో ఫన్నీ రిప్లై ఇచ్చారో అందరికీ అర్ధం అయ్యింది. ఇలా జాన్వీ పేరు వాడుకుని ఆ కాంట్రవర్సీని తాను సెటిల్ చేసేసుకున్నారని చెప్పవచ్చు. కాగా ఈ స్టేట్మెంట్ తన రానున్న సినిమా మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా సంగీత్ శోభన్ తో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. దీనితో ఈ ఊహించని స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి ఇదే తరహా స్టేట్మెంట్ ని నాగవంశీ ఇవ్వడం ఇదేమి మొదటిసారి కూడా కాదు. గతంలో మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా విషయంలో కూడా తాను చేయడం గమనార్హం. ఆమెపై తన ఒపీనియన్ చెబితే తన భార్య విడాకులు ఇచ్చేస్తుంది అంటూ చేసిన కామెంట్స్ ఆ మధ్య వైరల్ గా మారాయి. ఇక ఊర్వశి రౌతేలా తన బ్యానర్ లో డాకు మహారాజ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇపుడు మ్యాడ్ స్క్వేర్ తన బ్యానర్ లో ఈ మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











