War 2: దేవరను మించి హిట్టు.. తారక్ అన్న ఇండియా లెవెల్‌లో కాలర్ ఎగిరేసేలా.. వార్ 2 ఈవెంట్‌లో నాగవంశీ
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. వార్ 2 సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఆయన సినిమా జర్నీ.. ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మొదలు కానున్నది. తన తొలి సినిమానే ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో, హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో బలమైన పాత్రను ఆయన పోషిస్తున్నాడు. వార్ సినిమాకు సీక్వెల్ అనగానే నార్త్‌లోనే కాకుండా సౌత్‌లో కూడా ఆసక్తికరంగా ఎదురు చూడటం మొదలు పెట్టారు.ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీలో ఎంట్రీ ఇస్తున్నారనే విషయం మరింత క్రేజ్‌ను పెంచింది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూసఫ్‌గూడలోని స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, జూ ఎన్టీఆర్చ, దర్శకుడు ఆయన్ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..
మాటలతో మంత్రం చేసే ఇద్దరు వ్యక్తులు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ముందు మాట్లాడటం అంటే.. మాటల రావు. అలాంటి పరిస్థితుల్లో మీరు గోల చేస్తే అసలే మాట్లాడలేను. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలి. తారక్ అన్నను హిందీ రంగానికి తీసుకెళ్లినట్టు లేదు. హృతిక్‌ను తెలుగు సినిమా రంగానికి పరిచయం చేస్తున్నట్టు ఉంది. ఎవరైాన వార్ 2 హిందీ డబ్బింగ్ సినిమా అంటే.. సినిమాలో డబ్బింగ్ చూసినత తర్వాత పక్కాగా తెలుగు సినిమా అనిపిస్తుంది. ఇది ప్రాపర్ తెలుగు సినిమా అని నాగవంశీ అన్నారు.
తెలుగు దర్శకులు చూపించని విధంగా తారక్ అన్నను ఆయన ముఖర్జీ బాగా చూపించారని బాగా గర్వంగా ఫీలవుతారు. ఇది హృతిక్‌ను తెలుగు సినిమాకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెబుతున్నాం. ఎంత గ్రాండ్‌గా వెల్‌కమ్ చేస్తున్నామనే విషయాన్ని ఆగస్టు 14వ తేదీన చూపించారు. గతేడాది సెప్టెంబర్ 25 తేదీన రిలిజై దేవరకు ఎంత ప్రేమ చూపించామో.. అంతకంటే ఎక్కువగా చూపించాలి. హిందీ బాక్సాఫీస్ వద్ద నెట్ కలెక్షన్లు ఎంత వస్తుందో.. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఒక్క రూపాయైనా ఎక్కువ చూపించాలి అని నాగవంశీ అన్నారు.
దేవర సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు తీసుకొచ్చే బాధ్యత మీదే. ఇన్నాళ్లు తారక్ అన్న మీ కోసం కాలర్ ఎగురేసారు. అన్న ఇండియా లెవెల్‌లో కాలర్ ఎగిరేసేలా చేయాలి. ఆ బాధ్యత మీ మీదే పెడుతున్నాం. మీరు గుర్తు పెట్టుకోవాలి. సినిమా బాగుంది. సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా అద్బుతంగా ఉంటుంది. ఒకవేళ అలా లేకపోతే.. ఇక ముందు ఎన్నడూ నేను నా సినిమాలు చూడమని అడగను అని నాగవంశీ అన్నారు.


Click it and Unblock the Notifications











