‘విజయ్ దేవరకొండ విషయంలో మళ్లీ అలాంటి తప్పు.. కింగ్డమ్ ఉద్దేశమే ఇది’
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నెక్ట్స్ కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా కింగ్డమ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ చిత్రం బడ్జెట్..
విజయ్ దేవరకొండ కెరీర్ లో లైగర్ చిత్రం తర్వాత భారీ బడ్జెట్ వెచ్చించి నిర్మించిన చిత్రం కింగ్డమ్. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లలో సంయుక్తంగా సినిమాను నిర్మించడం విశేషం. స్టార్ కాస్ట్ ను తీసుకోవడంతో పాటు టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయడం మూలంగా సినిమాకు భారీగానే ఖర్చైంది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన రెమ్యూనరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ కలుపుకొని ఈ చిత్రానికి రూ.150 కోట్లకు పైగా పెట్టుబడి అయ్యిందని మేకర్స్ వెల్లడించారు.

విజయ్ దేవరకొండపై స్పెషల్ కేర్..
విజయ్ దేవరకొండ కేరీర్ లో ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నింటిలో మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు రెండే రెండు. పెళ్లి చూపులు చిత్రంతో విజయ్ బ్రేక్ అందినప్పటికీ అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ గా మారారు. యూత్ కు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత గీతా గోవిందం చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఈ చిత్రాల తర్వాత పెద్దగా హిట్ అందలేదు. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు వచ్చిన స్టార్డమ్, క్రేజ్ కు తగిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదనేది ఆడియెన్స్ అభిప్రాయం.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆ కంప్లైంట్స్ ను చెరిపేందుకు కింగ్డమ్ సినిమాతో వస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో నిర్మాతలు, దర్శకులు, స్టార్స్ కూడా విజయ్ దేవరకొండ కు సాలిడ్ హిట్ అందిస్తుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా విజయ్ కు ఎలాగైనా ఈ సారి భారీ ఓపెనింగ్స్ తో సక్సెస్ అందాలని, విజయ్ కింగ్డమ్ తో సరికొత్తగా కనిపిస్తారని అంటున్నారు. ఈ క్రమంలో నిర్మాత నాగ వంశీ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
నాగ వంశీ రీసెంట్ గా కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్తుందని చెప్పారు. అర్జున్ రెడ్డిలాంటి విజయ్ దేవరకొండను ఆయన అభిమానులు, ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. కింగ్డమ్ చిత్రంతో ఆ లోటు తీరిపోతుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంతముందు ఇంటర్వ్యూలోనూ విజయ్ కు అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత కింగ్డమ్ తోనే ఆ రేంజ్ కు మించి హిట్ పడుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో భ్యాగశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందించడం విశేషం.


Click it and Unblock the Notifications











