Nagababu: ఆరెంజ్ మూవీ రీరిలీజ్.. వచ్చే డబ్బు దేనికోసమో చెప్పిన నాగబాబు
చిరుత సినిమాతో మెగాస్టార్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ తో అలరించిన చెర్రీ అనతికాలంలోనే మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక గతేడాది వచ్చిన రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా రామ్ చరణ్ మాత్రమే కాకుండా ఎంటైర్ యూనిట్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలను వాళ్ల బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఆరెంజ్ మూవీని మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాకు వచ్చే డబ్బును దేనికోసం ఖర్చు చేయనున్నారో తాజాగా నాగబాబు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. తర్వాత మగధీర సినిమాతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చెర్రీ. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఎంతో మంది స్టార్లకు సంబంధించిన క్లాసిక్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో అలరించాయి.

ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'మగధీర' మూవీ రీ రిలీజ్‌ను ఏర్పాటు చేసినట్లు ముందుగా ప్రకటించిన చివరికీ ఆరెంజ్ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. మగధీర తర్వాత రామ్ చరణ్ చేసిన లవ్ స్టోరీ 'ఆరెంజ్' మూవీని మార్చి 25, 26 తేదీల్లో స్పెషల్ షోలు వేస్తున్నట్లు నిర్మాత నాగేంద్ర బాబు ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీకి వచ్చే రెవెన్యూ గురించి ఇంట్రెస్టింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు.

2010లో విడుదలైన ఆరెంజ్ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించారు. అయితే ఇప్పుడు స్పెషల్ షోస్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని ట్వీట్ చేశారు. "ఆరెంజ్ చిత్రాన్ని విడుదల చేసి, ఆ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి మన జనసేన పార్టీకి విరాళం ఇవ్వాలని నిర్ణయించాం. వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి అని ఆశిస్తూ నాగబాబు" అని ఆయన రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











