twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది ప్రభుత్వం తప్పే.. తన్ని మరీ నేర్పించండి.. మెగా బ్రదర్ సెన్సేషనల్ కామెంట్స్

    |

    ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంటే.. మరో వైపు కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. కరోనా ధాటికి తట్టుకోలేక 21 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్‌ను విధించారు. అయినా సరే కరోనా మాత్రం అదుపులో ఉండటం లేదు. ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా అక్కడక్కడా ప్రజలు రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యాడు.

     రోజురోజుకు విస్తరిస్తూనే..

    రోజురోజుకు విస్తరిస్తూనే..

    కరోనాను ఎంత కట్టడి చేద్దామని ప్రయత్నిస్తుంటే అంతగా విస్తరిస్తోంది. ఇంట్లేనే ఉండండి.. సురక్షితంగా ఉండండని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. సెలెబ్రిటీలు సైతం తమ అభిమానులకు అదే విషయాన్ని చెబుతూ కరోనాపై అవగాహన కలిగేలా చేస్తున్నారు.

    కరోనాపై నాగబాబు వ్యంగ్యాస్త్రాలు..

    కరోనాపై నాగబాబు వ్యంగ్యాస్త్రాలు..

    కరోనా మన దేశంలో ప్రవేశించిన నాటి నుంచి నాగబాబు వ్యంగ్యస్త్రాలు సంధిస్తూనే ఉన్నాడు. మానవ తప్పిదం వల్లే కరోనా పుట్టిందని, దేన్ని దేవుడే సృష్టించాడని కొందరు అంటున్నారు.. దేవుడికి కూడా కోపాలుంటాయా? అంటూ ఇలా ఏదో ఒకటి ట్వీట్ చేస్తూనే ఉన్నాడు.

    దేవుడు ఏమీ పీకలేడంటూ..

    దేవుడు ఏమీ పీకలేడంటూ..

    కరోనా వైరస్ నుంచి దేవుడు, స్వామిజీలు ఏమీ పీకలేక.. వైద్యుల వైపు చూస్తున్నారని కామెంట్ చేశాడు. కరోనా నుంచి సైంటిస్ట్‌లు, డాక్టర్లే మనల్నీ కాపాడుతారని వెళ్లి వాళ్ల కాళ్లు మొక్కుదామని ట్వీట్ చేశాడు. ఇలా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు.

    జనతా కర్ఫ్యూకు మద్దతు..

    జనతా కర్ఫ్యూకు మద్దతు..

    కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యావత్ భారతదేశ ప్రజలు స్వచ్ఛందంగా నిన్న ‘జనతా కర్ఫ్యూ' పాటించిన విషయం తెలిసిందే. ఈ జనతా కర్ఫ్యూకు తన మద్దతును తెలిపాడు. అంతేకాకుండా విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశాడు.

    మిలటరీని దించాలి..

    మిలటరీని దించాలి..

    అయితే లాక్ డౌన్ అయినా సరే బాధ్యతను విస్మరించి కొందరు బయటకు వస్తూనే ఉండటంపై నాగబాబు ఫైర్ అయ్యాడు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఓ విన్నపం కూడా చేశాడు. మన దేశంలోని ఎక్కువ మంది ప్రజలు నిరక్షరాస్యులు, క్రమశిక్షణారాహిత్యం గలవారు, నిర్లక్ష్యం గలవారు వీరందిర్నీ కంట్రోల్ చేయాలంటే మిలటరీ సాయం తీసుకోవాలని కేంద్రానికి సలహా ఇచ్చాడు.

    అది ప్రభుత్వ తప్పిదమే..

    అది ప్రభుత్వ తప్పిదమే..

    తాజాగా నాగబాబు.. ‘న్యూస్‌లో ఎవరో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది."మనం ప్రజలకి హక్కులు నేర్పాము.బాధ్యతలు నేర్పలేదు"అక్షర సత్యం ...ఈ తప్పు ప్రభుత్వం వారిదే.మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది.నేను కూడా అతితుడ్ని కాదు.మా ప్రజలందరికీ తన్ని బాధ్యతలు నేర్పించండి.నేర్చుకుంటాం' అని ట్వీట్ చేశాడు.

    English summary
    Naga Babu fires On Indian peoples. He Says That Government Says About Rights But Not Duties To People. This Is Governments Mistakes Only.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X