అప్పులో మునిగి.. మళ్లీ సూపర్ స్టార్‌గా.. నాగబాబు
విశాఖలో ఐదేళ్లుగా తక్కువ ఖర్చులో నాణ్యమైన వీఎఫ్‌ఎక్స్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందిస్తూ... అందరి అభిమానం చూరగొన్న 'లియో 9 వీఎఫ్‌ఎక్స్' స్టూడియో హైదరాబాద్‌లో బ్రాంచ్ ఓపెన్ చేసింది. ప్రముఖ నటులు, మెగా బ్రదర్ నాగబాబుగారు ఈ స్టూడియో బ్రోచర్, టీజర్ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సినిమాలో నటించిన తర్వాత వ్యాపారంలోకి సునీల్ చరణ్‌కి, జయవాణి ప్రవేశించి ఈ స్టూడియోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి గంపా సిద్ధలక్ష్మి, 'జబర్దస్త్' నటులు చమ్మక్ చంద్ర, అప్పారావుతో పాటు పి. రాము తదితరులు పాల్గొన్నారు.
అమితాబ్ బచ్చన్ వ్యాపారాలు చేసి నష్టపోయి, మళ్లీ సూపర్‌స్టార్‌గా ఏదిగారు. రణ్‌వీర్ సింగ్, విజయ్ దేవరకొండ, 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చి సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రీలో పైకి రావడానికి గాడ్ ఫాదర్ ఎవరూ అవసరం లేదు. చిరంజీవిగారు కూడా ఏ గాడ్ ఫాదర్ లేకుండా పైకి వచ్చారు. మన కష్టం, ప్రతిభ, అంకితభావంపైన మన విజయాలు ఆధారపడి ఉంటాయి. సునీల్ చరణ్ తన కష్టం, ప్రతిభతో పైకి రావాలి. స్పెషల్ ఎఫెక్ట్స్‌కి ఎండ్ లేదు. ఫారిన్‌లో వీఎఫ్‌ఎక్స్ చేయిస్తే ఎక్కువ ఖర్చు కనుక వాళ్లు మన దగ్గరకు వస్తున్నారు అని నాగబాబు పేర్కొన్నారు.

సునీల్ చరణ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల కిత్రం వైజాగ్‌లో 'లియో 9 వీఎఫ్‌ఎక్స్' స్టూడియో ప్రారంభించాం. అమెరికా నుండి క్లయింట్స్ మా దగ్గరకు వస్తున్నారు. హైదరాబాద్ నుండీ వస్తున్నారు. జయవాణిగారు మా వర్క్ చూసి, హైదరాబాద్ రావడానికి మాకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. ఏ కెమెరాతో షూటింగ్ చేసినా... మా స్టూడియోకి వస్తే, బెస్ట్ క్వాలిటీ ఇస్తాం. మా స్టూడియోలో వర్క్ చేశాక చూస్తే... పెద్ద సినిమాలా ఉంటుంది. క్లయింట్స్‌కి టైమ్‌కి క్వాలిటీ వర్క్ ఇవ్వడమే మా లక్ష్యం'' అన్నారు.


Click it and Unblock the Notifications











