అకీరా, ఆద్యకు తీవ్ర అవమానం.. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం వేళ ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. వీరితో పాటు 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో చిరంజీవి, నాగబాబు, సాయిధరమ్ తేజ్, రామ్ చరణ్, అకీరా, ఆద్య, నిహారిక తదితరులు ప్రత్యేక బస్సులో వేదిక వద్దకు చేరుకున్నారు. పవన్ వేదిక పైకీ వచ్చినప్పుడు వీరంతా మిగిలిన అభిమానుల్లాగే కేరింతలు కొట్టారు. అయితే ఈ ఆనంద సమయంలో అకీరా నందన్, ఆద్యకు అవమానం ఎదురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త వివరాల్లోకి వెళితే..

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అకీరా తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఎరుపు రంగు చొక్కా, పంచెకట్టులో వచ్చి అందరినీ ఆకర్షించారు. అకీరా, ఆద్య ఫోటోలను రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన బిడ్డలిద్దరూ ప్రమాణ స్వీకార వేదిక నుంచి తనకు వీడియో కాల్ చేసినట్లు రేణు తెలిపారు. వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డేకు రెడీ అయ్యారు.. ఏపీకి మంచి చేయాలనుకునే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అంటూ ఆమె పోస్ట్ చేశారు. ప్రస్తుతం రేణూ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

nagababu and akira nandan aadhya stopped to go near pawan kalyan oath taking ceremony

ఇకపోతే.. తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇతర కుటుంబ సభ్యులపై నాగబాబు ఈగ వాలనివ్వరు. వాళ్లపై ఎవరైనా విమర్శలు చేస్తే.. వెంటనే నాగబాబు నుంచి కౌంటర్లు పడిపోతాయి. ఈ విషయంలో వివాదాలు రేగినా, ఏం జరిగినా సరే వెనక్కితగ్గరు. గతంలో చిరంజీవి, పవన్‌లపై విమర్శలు చేసినవారిపై నాగబాబు ఆగ్రహం చేస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించేవారు.

తాజా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నాగబాబును ఎక్కడో చోట పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌ బరిలో నిలిచేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సీటును పొత్తులో భాగంగా జనసేన దక్కించుకుంది కూడా. అయితే బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ అనకాపల్లిని వదులుకున్నారు. ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీ కొట్టడంతో నాగబాబును రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

nagababu and akira nandan aadhya stopped to go near pawan kalyan oath taking ceremony

ఇదిలా ఉండగా, ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లే సమయంలో పవన్ సోదరుడు , జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు భద్రతా సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. వేదిక వద్దకు వెళ్తున్న పవన్ పిల్లలు అకీరా నందన్, ఆద్యలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సమయంలో వీరి వెంటే ఉన్న నాగబాబు సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ మార్గంలో దారి లేదని, మరో మార్గంలో వెళ్లాలని సూచించారు. అటువైపు తాము వెళ్లబోమని చెప్పి అకీరా, ఆద్యలను తీసుకుని వెనక్కి వెళ్లిపోతుండగా నాగబాబును తిరిగి పిలుచుకుని వచ్చారు.

ఈ ఇష్యూ గురించి తెలుసుకున్న ఓ భద్రతా అధికారి అక్కడికి చేరుకుని నాగబాబు, అకీరా , ఆద్యలను లోపలికి అనుమతించారు. ఈ సందర్భంగా సదరు అధికారిపై మెగా బ్రదర్ విరుచుకుపడ్డారు. తమ కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఉందని, అలాంటిది తమను అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ వివాదం నేపథ్యంలో కాసేపు నాగబాబు, అకీరా, ఆద్యలు అక్కడే ఉండటంతో వారితో ఫోటోలతో దిగేందుకు జనం ఎగబడ్డారు. ముఖ్యంగా అకీరా నందన్‌ను చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు కేరింతలు కొట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X