నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ డియాక్టిట్..కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేశానంటూ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సినీ నటుల కుటుంబం నుంచి ఒక నటి బయటకు రావడం అనేది చాలా కష్టమైన విషయం.. కానీ మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన మొట్టమొదటి నటి నిహారిక.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె అయిన ఆమె ముందు నటిగా ఆ తర్వాత యాంకర్గా ఆ తర్వాత నిర్మాతగా కూడా మారి సినీ రంగంలో నిలబడే ప్రయత్నం చేసింది. కొద్ది రోజుల క్రితం ఆమెకు వివాహం జరగడంతో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టింది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉండే ఆమె అకౌంట్ డీ ఆక్టివేట్ చేసుకోవడంతో అనేక పుకార్లు చెలరేగాయి. తాజాగా ఈ విషయం మీద మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. వివరాల్లోకి వెళితే

అకౌంట్ డి యాక్టివేషన్ వ్యవహారం
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తన సోదరులతో పోలిస్తే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫ్యాన్స్ తో నాగబాబు మాత్రమే టచ్ లో ఉంటూ ఉంటారు.. అందులో భాగంగానే ఆయన తరచుగా ఆస్క్ మీ సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ స్పెషల్స్ లో భాగంగా అభిమానులు కూడా తనకు ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేసి
అలా తాజాగా ఒక సెషన్ నిర్వహించగా అందులోనే నిహారిక అకౌంట్ డి యాక్టివేషన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నాగబాబు ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అయితే ఓ యూజర్ నిహారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎందుకు డిలీట్ చేసింది?ఆ రూమర్స్ గురించి రెస్పాండ్ అవ్వండి అని అడిగాడు.

డిలీట్ చేసి
దీనికి రిప్లై ఇచ్చిన నాగబాబు.. 'నిజానికి నేనే కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేసి అకౌంట్ డియాక్టివేట్ చేశాను. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని అకౌంట్ రీ యాక్టివ్ చేస్తాను' అంటూ చాలా సరదాగా సమాధానం ఇచ్చాడు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిహారిక కొన్ని రోజుల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్‌ని డిలీట్ చేసిన సంగతి తెలిసిందే.

రకరకాల ప్రచారాలు
ఆమె అలా దానిని డిలీట్ చేసిందో లేదో పలు ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. కానీ నిహారిక భర్త చైతన్య తన ఇన్‌స్టా నుంచి ఇద్దరి ఫోటోలు షేర్ చేస్తూ ఆ రూమర్స్‌కి చెక్ పెట్టారు. ఆమె ఎందుకు డిలీట్ చేసిందో తెలియదు కానీ ఎకౌంటు ఎందుకు డిలీట్ చేసింది అనే విషయంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరిగింది.

వరుణ్ తేజ్ పెళ్లి
ఇక ఇదే సమయంలో నాగబాబు తన కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి గురించి కూడా స్పందించాడు. వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అని అడిగిన ఒక నెటిజన్ కు సమాధానం ఇస్తూ వరుణ్ తేజ్ ని ట్యాగ్ చేసి వాళ్లకు కూడా తెలియాలి కదా అంటూ సమాధానం ఇచ్చాడు.. గతంలోనే వరుణ్ తేజ్ పెళ్లి గురించి అనేక సార్లు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ప్రతి సారి ఏదో ఒక హీరోయిన్ తో పెళ్లి అంటూ వరుణ్ తేజ్ పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











