నాగబాబుపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ .. సైలెంట్ గా కెలికేసిన మెగా బ్రదర్ మిస్టరీ పోస్ట్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని పాపులర్ కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఒకప్పుడు అంటే మెగా కుటుంబం అంటే అల్లు హీరోలు కూడా మెగా అనే బ్రాండ్ లోనే ఉండేవారు. నిర్మాత అల్లు అరవింద్ కూడా ఎన్నో మార్లు మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. కానీ తన వారసుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఇపుడు పరిస్థితులు అంతా ఒక్కసారిగా మారటమే కాదు, రోజు రోజుకి అవి మరింత హీట్ కి దారి తీస్తున్నాయి.
సినిమా కెరీర్ స్టార్టింగ్ లో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లను తలచుకోకుండా తన ఏ సినిమా స్పీచ్ కూడా ముగిసేది కాదు. ఒక్క అల్లు అర్జున్ సినిమా అనే కాదు మెగా కుటుంబంలో ఏ హీరో వేడుక అయినా పవన్ పేరు చెబితే మారు మోగాల్సిందే. కానీ ఐకాన్ స్టార్ పెట్టుకున్న వైరం ఇప్పుడు ఓ రేంజ్ లోకి మారిపోయింది.

కాగా ఇది సినిమా నుంచి రాజకీయాల్లోకి కూడా మారడంతో అల్లు అర్జున్ కి మెగా కుటుంబ అభిమానుల నడుమ చీలిక మరింత పెరుగుతూ వస్తోంది. అల్లు అర్జున్ ఎపుడైతే తన సపోర్ట్ జనసేన కి కాదని వైసీపీ అభ్యర్థికి చేసాడో అక్కడ నుంచే మెగా కుటుంబంలో చాలా మంది తన విషయంలో అసహనంగా ఉన్నారనే టాక్ బయటకి వచ్చింది. కాగా మెగా బ్రదర్ నాగబాబు అయితే అప్పట్లో పెట్టిన పలు పోస్ట్ లు కూడా కాంట్రవర్సీలకి దారి తీశాయి.
అక్కడ నుంచి అల్లు అర్జున్ పై ఏ నెగిటివ్ పోస్ట్ కానీ ట్రోల్స్ పడ్డా కానీ అది చేయించింది నాగబాబే అంటూ అల్లు అభిమానులు కూడా భావిస్తున్నారు. కానీ ఆ తర్వాత సైలెంట్ అయ్యిపోయిన నాగబాబు ఇప్పుడు మళ్లీ పెట్టిన ఓ షాకింగ్ పోస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ట్రిగ్గర్ చేసినట్టు అయ్యింది అని చెప్పాలి. ఇపుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది. ఆల్రెడీ తెలంగాణలో మేకర్స్ భారీ టికెట్ హైక్స్ ని తెచ్చుకున్నారు.
కానీ ఏపీలో మాత్రం ఇప్పుడు ఉన్నది పవన్, చంద్రబాబు కూటమి ప్రభుత్వం. దీనితో పుష్ప 2కి మాత్రం ఏపీలో హైక్స్ ఇవ్వకూడదు అని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కొంచెం హడావుడి చేశారు. ఖచ్చితంగా ఇపుడు అల్లు అర్జున్ అండ్ తన కాంపౌండ్ దిగి వస్తారు అని పవన్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ , బన్నీ వాసులు పవన్‌ని ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఈ క్రమంలోనే నాగబాబు ఈ ఇన్సిడెంట్ అండ్ అల్లు అర్జున్ కి మ్యాచ్ అయ్యేలా ట్వీట్ చేయడం ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
ఇంతకీ ఇందులో ఏముందంటే.. నువ్ తప్పుడుదారిని ఎంచుకున్నావ్ అని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గమనించి సరి చేసుకో.. లేదంటే ముందు ముందు ఆ దారి నీకు మరింత కష్టతరంగా మారగలదు" అంటూ స్వామి వివేకానంద చెప్పిన మాటలుగా పోస్ట్ చేసారు. దీనితో ఇది అల్లు అర్జున్ నే టార్గెట్ చేసినట్టుగా ఉంది అంటూ ఒక్కసారిగా ఈ పోస్ట్ చర్చకు దారి తీసింది.
అల్లు అర్జున్ తప్పుడు దారి ఎంచుకున్నాడు అని, తమ కుటుంబాన్ని కాదని మరో దారి ఎంచుకుంటే అది తన కెరీర్ కే మంచిది కాదు అంటూ నాగబాబు పెట్టారని చాలా మంది ఫిక్స్ అయ్యిపోయారు. దీనితో ట్రిగ్గర్ అయ్యిన ఐకాన్ స్టార్ అబిమానులు కూడా నాగ బాబుపై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











