బిగ్ ట్విస్ట్ .. "పుష్ప 2" రిలీజ్ ముందు నాగబాబు సంచలన పోస్ట్ , బన్నీకి షాకిచ్చాడుగా!
చాలాకాలం తర్వాత సౌత్ సినిమా నుంచి అందులోనూ తెలుగు ఇండస్ట్రీ నుంచి భారీ హైప్‌తో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2". కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి ఎంతో శ్రమించి తెరకెక్కించారు.
పుష్ప పార్ట్ 1 ఎప్పుడో 2021లో తీసుకొస్తే అప్పట్లోనే ఆ చిత్రం హిందీ సహా తెలుగులో మంచి వసూళ్లు సాధించి అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అప్పట్లో సరైన అక్యుపెన్సీలు లేనప్పటికీ అల్లు అర్జున్ ఏకంగా రూ.375 కోట్లకి పైగా గ్రాస్‌ని అందుకున్నాడు. దీనితో నెక్స్ట్ పార్ట్ 2పై భారీ హైప్ నెలకొనగా ఇపుడు ఈ సినిమా విడుదలకి రెడీ అయ్యింది.

ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రస్తుతం అల్లు అర్జున్‌కి , మెగా అభిమానులు - మెగా కుటుంబం మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అని చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన పలు షాకింగ్ పోస్ట్స్‌తో పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఆ తర్వాత సైలెంట్ అయ్యిపోయిన నాగబాబు మళ్లీ రీసెంట్ గానే చేసిన ఓ పోస్ట్ మళ్లీ టాలీవుడ్‌లో పెద్ద చర్చకి దారి తీసింది.
ఇది కూడా అయ్యింది అనుకునేలోపే సరిగ్గా పుష్ప రిలీజ్ ముందు నాగబాబు చేసిన మరో పోస్ట్ ఇపుడు ఒక్కసారిగా పెద్ద ట్విస్ట్ యిచ్చింది. తన పోస్ట్‌లో ఎక్కడా పుష్ప 2 అని కానీ, అల్లు అర్జున్ అని కానీ ఎక్కడా మెన్షన్ చేయకుండా అల్లు అర్జున్ పోస్ట్ చేయడం గమనార్హం. ఇంతకీ నాగబాబు ఏమని పోస్ట్ చేసారంటే..
"24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే 'సినిమా'. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం... అందరిని అలరించే సినిమాని సినిమాలానే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని , ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేసారు.
దీనితో తనకి ఇది కూడా అయిష్టంగానే పోస్ట్ చేసినట్లుగా అందరి సినిమాలు ఒకటే, వాటిలానే అన్ని సినిమాలని మెగా అభిమానులు కూడా ఆదరించాలి అంటూ నాగబాబు పోస్ట్ చేశారు. అంటే ఇన్ డైరెక్ట్‌గా తనకి ఇష్టం లేకపోయినా పుష్ప 2ని చూడాలి అన్నట్టుగా చెబుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఎంత పుష్ప 2 సినిమా పేరు పెట్టకపోయినప్పటికీ ఇపుడు రిలీజ్ అవుతున్నది ఒక్క పుష్ప 2 మాత్రమే. సో డెఫినెట్ గా పుష్ప 2 కి మాత్రమే నాగబాబు పోస్ట్ ఆపాదిస్తుంది.
దీనితో సరిగ్గా రిలీజ్ ముందే నాగబాబు నుంచి ఊహించని పోస్ట్ రావడం ఒకింత ఊహించనిదిగా నిలిచింది అని చెప్పక తప్పదు. కాగా దీనిపైనా బన్నీ ఫ్యాన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు. కానీ నాగబాబు పెట్టింది మాత్రం ముమ్మాటికీ పుష్ప 2 కోసమే అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. మరి ఈ సినిమా విషయంగా చివరి నిమిషంలో ఆయన ఇచ్చిన పిలుపు ఎటు దారి తీస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











