మీమ్ వేసుకో.. ఐఫోన్ తీసుకో...మెగా బ్రదర్ బంపర్ ఆఫర్..

అన్న చిరంజీవి అండతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగబాబు మొదట్లో హీరోగా ప్రయత్నాలు చేశారు. అది కలిసి రాకపోవడంతో తర్వాత నిర్మాతగా మారారు. ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడి ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క టీవీ షోలు చేస్తున్నారు. గతంలో జబర్దస్త్ షో ద్వారా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నాగబాబు ఆ తర్వాత జీ తెలుగు సంస్థకు వెళ్లి అదిరింది షో నిర్వహించారు. ఏమైందో ఏమో కానీ నాగబాబు ఆ షోకి కూడా దూరం అయ్యారు. కానీ ఆ షోలో గల్లీ బాయ్స్ రౌడీ బాయ్స్ అంటూ అలరించిన రెండు గ్యాంగ్లను సిద్ధం చేసి బస్తీ బాయ్స్ పేరిట వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు.

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. నాగబాబు ఒరిజినల్స్ ఛానల్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ మొదటి వీడియో ప్రస్తుతం ఇండియా వైడ్ గా ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ ను మరింత పుష్ చేయడానికి నాగబాబు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ మీద మీమ్స్ చేసి ఆకట్టుకున్న వారికి ఐఫోన్ ఇస్తామంటూ ప్రకటించాడు. ఈ మేరకు ఓ కాంటెస్ట్ నడుపుతున్నామని అందులో గెలిచిన వారికి ఐ ఫోన్ బహుమతిగా ఇస్తానని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

Nagababu memes Contest for Basthi boys with IPhone gift

''మీమ్స్ అలెర్ట్.. మీమ్ వేస్కో .. ఐఫోన్ తీస్కో, బస్తీ బాయ్స్ అన్నీ ఎపిసోడ్స్ చూసి మీమ్స్ వేయండి.. హయ్యస్ట్ రీచ్ వచ్చిన మీమ్‌కి ఐఫోన్ ఇస్తాం.. ఈ కాంటెస్ట్ బస్తీ బాయ్స్ లాస్ట్ ఎపిసోడ్ వరకు ఉంటుంది..! మీమ్ డిస్క్రిప్షన్‌లో #basthiboysmemes అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి" అని నాగబాబు చెప్పుకొచ్చారు. నాగబాబుకి నిజానికి మీమర్స్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఇది వరకే మీమర్స్‌తో నాగబాబు స్పెషల్‌గా ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ కూడా పెట్టి ఆ లైవ్ లోనే అనేక మంది మీమ్ క్రియేటర్స్ తో నాగబాబు మాట్లాడారు. మరి చూడాలి ఈ ప్రయత్నం నాగబాబు & కోకి ఏ మేరకు కలిసి వస్తుందో ?

పూలతో అందాలను దాచేస్తున్న జక్వాలిన్ ఫెర్నాండెజ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X