twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనం బాగుపడాలంటే.. తొక్కేయాల్సిందే: నాగబాబు సెటైర్.. ఎవరి గురించో తెలుసా?

    |

    మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్‌లో సొంత ఛానెల్ పెట్టి ఏపీలోని తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నేతలపై కొద్దికాలంగా ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మై ఛానల్, నా ఇష్టం అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి రకరకాల సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సైకిల్‌ను టార్గెట్‌గా చేసుకొని తన విమర్శనాస్త్రాలను సంధించారు. టీడీపీ అధికార చిహ్నం సైకిల్ అనే విషయం అందరికీ తెలిసిందే. సైకిల్‌పై నాగబాబు వేసిన సెటైర్లు ఏం వేశారంటే..

    సైకిల్ కిందపడేసి తొక్కడం

    సైకిల్ కిందపడేసి తొక్కడం

    తాజాగా మై ఛానల్‌లో నాగబాబు పోస్టు చేసిన వీడియో ప్రకారం.. ఇద్దరు పిల్లలు సైకిల్‌ను తొక్కుతుంటారు. ఒక అబ్బాయి సైకిల్‌పై తిరుగుతూ తొక్కుతూ కనిపిస్తే.. మరొక అబ్బాయి సైకిల్‌ను కింద పడేసి తొక్కుతుంటాడు.

    ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే

    ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే

    ఇద్దరు అబ్బాయిల్లో ఒకరిని ఉద్దేశించి ఏం చేస్తున్నావంటే.. ఆరోగ్యం బాగుండాలని సైకిల్ తొక్కుతున్నాను అని అంటాడు. మరొ పిల్లాడిని అలా సైకిల్‌ను కింద పడేసి తొక్కుతున్నావంటే.. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే సైకిల్‌ను తొక్కేయాలి అంటూ కామెంట్ విసిరుతాడు.

     సైకిల్‌నే తొక్కేయాలి.. మరిచిపోవద్దని

    సైకిల్‌నే తొక్కేయాలి.. మరిచిపోవద్దని

    అనంతరం నాగబాబు క్లారిటీ ఇస్తూ.. ఆరోగ్యం బాగుపడాలంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా సైకిల్‌నే తొక్కేయాలి. మీరు గుర్తుంచుకోవాలి. మరిచిపోరు కాదా అని నాగబాబు ముగించారు. ఇలా సైటైర్లు వదులుతూనే మరో కామెంట్ విసిరాడు.

    ప్రకటన మాత్రమేనని నాగబాబు

    ప్రకటన మాత్రమేనని నాగబాబు

    సైకిల్ ప్రకటన దేనికి సంబంధించి కాదు. ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదు. కేవలం సైకిల్ కంపెనీకి సంబంధించి మాత్రమే అని నాగబాబు చెప్పడం కొసమెరుపు. ఇలా కొద్దికాలంగా అధికార పార్టీపై విరుచుకుపడటం నాగబాబుకు హాబీగా మారినట్టు కనిపిస్తున్నది.

    English summary
    Actor Nagababu Comments on TDP indirectly. He satires on Party official symbol Cycle. He threws full of satires on TDP. He involves two kids in this Video and Targetted AP Politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X