దేవుళ్లు, స్వామిజీలు ఏమీ పీక లేక.. వెళ్లి వాళ్లకు మొక్కుదాం.. అంటూ నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

ఓ వైపు కరోనా శరవేగంగా దూసుకుపోతూ ఉంటే కొందరు మాత్రం ఇంట్లో కూర్చుని సెటైర్లు వేస్తున్నారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచమంతా శ్రమిస్తుంటే.. కొందరు వాటిపై మీమ్స్ క్రియేట్ చేసి టైమ్ పాస్ చేస్తున్నారు. అందరూ అదో టైప్ అనుకుంటే మెగా బ్రదర్ ఇంకో టైపు. కరోనా విజృంభించిన దగ్గరి నుంచి ఏదో రకమైన ట్వీట్ పెడుతూ కాంట్రవర్సీలకు దారి తీస్తున్నాడు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అదేంటో ఓ సారి చూద్దాం.

అలా మొదలు..

అలా మొదలు..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో నాగబాబు ఈ విధంగా ట్వీట్ చేశాడు. ‘ఈ భూమి మీద మనిషి అనే జీవి పూర్తిగా చస్తే ఈ భూమి,ప్రకృతి,వాతావరణం అద్భుతంగా ఉంటాయి,మిగిలిన జీవరాసులు చాలా చాలా సంతోషంగా జీవిస్తాయి. సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బ్రతుకుతున్నాయి...కారోన వైరస్ తో సహా....ఒక్క మనిషి తప్ప' అంటూ కౌంటర్ వేశాడు.

దేవుళ్ళకి కోపం ఎక్కువే సుమా

దేవుళ్ళకి కోపం ఎక్కువే సుమా

‘కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే కారోన వైరస్ ని వాళ్ళ దేవుడే ఈ భూమి మీద కి పంపించాడు అని అంటున్నారు.అయినా ఈ దేవుళ్ళ కి కోపం ఎక్కువే సుమా.. 'అంటూ మరో సెటైర్ వేశాడు. నాగ బాబు చేసే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చిచ్చు పెట్టేలానే కనిపిస్తోంది.

చాలెంజ్ అంటూ మరో ట్వీట్..

చాలెంజ్ అంటూ మరో ట్వీట్..


‘దేవుడి భక్తులకి నా ఛాలెంజ్.ఎక్కువ గా గ్రూప్స్ గా వుండొద్దు అని ప్రభుత్వం వారి సూచన..సో మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మీ ప్రార్ధనాలయాలకి గ్రూప్స్ గా వెళ్లి పూజలు ,ప్రార్ధనలు చెయ్యండి. ప్రసాదాలు, తీర్థాలు,స్వీకరించండి.సేఫ్ గా ఉంటే దేవుడు గొప్ప తేడా అయితే కారోన వైరస్ గొప్ప' అంటూ మరో ట్వీట్ చేశాడు.

Recommended Video

Adirindi Comedy Show Anchor Sameera Out Of The Show
 దేవుళ్లు ఏమీ పీకలేక..

దేవుళ్లు ఏమీ పీకలేక..

‘మా దేవుడు గొప్ప,మా దేవుడు గొప్ప అని ఇంకా కొట్టుకొని చావకండి..దేవుళ్ళు, స్వామిజీలు దేవుడి ప్రతినిధులు ఏమి పీకలేక గుళ్ళు ప్రార్థన మందిరాలు ఇంకా అన్ని మూసుకొని కూర్చుని సైంటిస్ట్‌లు డాక్టర్స్ ఏ మందు కనిపెట్టి మనలని కాపాడతారా అని ఎదురు చూస్తున్నారు. వెళ్లి సైంటిస్టులకి మొక్కుదాం.ఈ కారోన బారినుంచి మనల్ని కాపాడేది వాళ్లే.' అంటూ సెన్సేషనల్ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X