వరుణ్ అలా.. నిహారిక ఇలా.. పెళ్లి తరువాత మాటలు తగ్గాయి: నాగబాబు షాకింగ్ కామెంట్స్

మెగా హీరోలంతా ఒకేలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు రూట్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాంటి విషయాన్ని అయినా సరే ధైర్యంగా చెప్పడం ఆయనకి అలవాటే. ఇక విమర్శలు చేసే వారికి కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడం ముందు నుంచి ఉన్నదే. ఇక కూతురి పెళ్లి అనంతరం వివిధ రకాల యూ ట్యూబ్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఆయన ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్, నిహారికల గురించి మాట్లాడారు.

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక..

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక..

నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఒక విధంగా డిఫరెంట్ గా అడుగులు వేస్తున్నారు. జీ ఛానెల్ లో జబర్దస్త్ కు పోటీగా అదిరింది షోను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అలాగే యూ ట్యూబ్ ఛానెల్ ను కూడా స్టార్ట్ చేసి విభిన్నమైన అంశాలపై స్పందించడమే కాకుండా తనదైన శైలిలో సలహాలు కూడా ఇస్తున్నారు.

యూ ట్యూబ్ లో నిహారిక పెళ్లి వీడియోలు

యూ ట్యూబ్ లో నిహారిక పెళ్లి వీడియోలు

ఇటీవల నాగబాబు తన కూతురి వివాహ వేడుకను ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి వేడుక నుంచి వచ్చిన తరువాత వేడుకలో మధుర క్షణాలను తన ఛానెల్ లో షేర్ చేసుకుంటున్నారు. అలాగే వేడుకకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు.

అప్పుడే ఆడపిల్ల పుట్టాలని అనుకున్నా

అప్పుడే ఆడపిల్ల పుట్టాలని అనుకున్నా

నిహారిక గురించి మాట్లాడుతూ.. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. వరుణ్ తేజ్ పుట్టగానే ఆడపిల్ల పుడితే బావుండు అని కోరుకున్నాను. అలా అనుకోగానే మాకు నిహారిక జన్మించింది. నిహారిపై ఉన్న ఇష్టాన్ని మాటల్లో చెప్పలేను. నాకు ఒక మంచి స్నేహితురాలు కూడా. ఎన్నో విషయాలను ఆమెతో పంచుకుంటాను కూడా.

పెళ్లి తరువాత మాటలు తగ్గాయి

పెళ్లి తరువాత మాటలు తగ్గాయి

మా ఇద్దరి మధ్య మాటల్లో చెప్పలేనంత అనుబంధం ఉంది. కాకపోతే పెళ్లి తరువాత మా ఇద్దరి మధ్య కొంత మాటలు తగ్గాయి. అయినప్పటికీ నా కూతురి ఒక మంచి ఇంట్లోకి వెళ్లి వెళ్లడంతో కొత్త ఆనందంలోకి అడుగు పెట్టినంత ఆనందంగా ఉంది. నిహారిక చాలా తెలివి గల అమ్మాయి. ఏం చెప్పినా కూడా చాలా తొందరగా అర్థం చేసుకుంటుంది.. అని నాగబాబు అన్నారు.

వరుణ్ తేజ్ ఎలా ఉంటాడంటే..

వరుణ్ తేజ్ ఎలా ఉంటాడంటే..

ఇక వరుణ్ తేజ్ గురించి మాట్లాడిన నాగబాబు నిహారిక ఎక్కడైనా సరే అల్లరిగా ఉంటుంది. కానీ వరుణ్ తేజ్ మాత్రం అలా ఉండడని అన్నారు. ఇంట్లో లేదా కొంత మంది స్నేహితుల దగ్గర మాత్రమే చాలా ఓపెన్ గా ఉంటాడు. పబ్లిక్ లోకి వెళితే మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాడు.

వరుణ్ తేజ్ పెళ్లి..

వరుణ్ తేజ్ పెళ్లి..

వరుణ్ తేజ్ పెళ్లి విషయానికి వస్తే.. అతనిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివహమా అనేది ముఖ్యం కాదు. మెయిన్ గా కోరుకునేది పిల్లల భవిష్యత్తు కోసమే. మంచి బాగస్వామీ రావాలని ఎలాంటి పరిస్థితులలో అయినా సరే అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటే బావుంటుందని నాగబాబు వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ వయసు 31 కాగా వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని ఉన్నట్లు నాగబాబు గత ఇంటర్వ్యూలో క్లారిటీ అయితే ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X