మెడలో కొండచిలువ.. పక్కనే నాగుపాము.. మెగా బ్రదర్ నాగబాబు షాకింగ్ ఫొటోస్
మెగా యాక్టర్ నాగబాబు ఈ మధ్య కాలంలో ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పనులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంన్నాయనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుంచి కాంట్రవర్సీలపై ఎక్కువగా ఆయనే స్పందిస్తు ఉంటారు. యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా చేస్తున్న కామెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పాలిటిక్స్ పైనే కాకుండ వివిధ రకాల ఘటనలపై కూడా నాగబాబు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నాగబాబు మెడలో పామును వేసుకొని కనిపించారు.

ఆ షో నుంచి తప్పుకోవడంతో..
మెగా ఫ్యామిలీలో దాదాపు అందరు హీరోలే.. ఒక్క నాగబాబు తప్ప. కానీ సహా నటుడిగా విభిన్న పాత్రలతో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందునున్నాడు. ఇక జబర్దస్త్ షో ద్వారా ఆయన క్రేజ్ మరో లెవెల్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం పలు కారణాల వల్ల ఆ షో నుంచి తప్పుకోవడంతో అప్పట్లో ఆ న్యూస్ కాంట్రవర్సీని క్రియేట్ చేసింది.

సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్
ఇక జబర్దస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు కొణిదెల ఒరిజినల్స్ అనే యూ ట్యూబ్ ఛానెల్ ను క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. సొంతంగా ఛానెల్ లో కామెడీ అలాగే సందేశాత్మక విషయాలను చెబుతున్నాడు. తొందరగా డబ్బు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్ తో నాగబాబు ఛానెల్ కు మంచి క్రేజ్ దక్కింది.

కొత్తగా వచ్చేవారికి..
ఇక ప్రతి శుక్రవారం కొంతమంది కమెడియన్స్ తో ఖుషిఖుషీగా అనే స్టాండ్అప్ కామెడీ షోను రన్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. కేవలం నటుడిగానే కాకుండా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఇలా యూ ట్యూబ్ ద్వారా ఆదాయాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొత్తగా వచ్చే కమెడియన్స్ కు కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మెడలో కొండచిలువ
ఇక రీసెంట్ గా నాగబాబు కొన్ని స్పెషల్ ఫొటోలను పోస్ట్ చేశారు. అందులో నాగబాబు పాములతో ఫోటోలకు స్టిల్ ఇచ్చారు. ఒక ఫొటోలో అయితే కొండ చిలువను తన మెడలో వేసుకున్నారు. ఇక మరొక ఫొటోలో నాగు పాముతో స్టిల్ ఇచ్చారు. ప్రతి జీవరాశి కూడా ఈ భూ ప్రపంచంలో సమానమే అంటూ వాటికి ఇక్కడ జీవించే హక్కు ఉందని, అందుకే వాటిని కాపాడుతూ ప్రేమను పంచాలని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











