నిహారిక ఎంగేజ్మెంట్.. ఇక నుంచి ఆ సమస్య నిదే.. కొత్త అల్లుడిపై నాగబాబు కామెంట్
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం చాలా సింపుల్ గానే ముగిసింది. గురువారం రాత్రి ప్రయివేట్ హోటల్ లో చైతన్య జొన్నలగడ్డ, నిహారిక కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకున్నారు. ప్రస్తుతం వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నాగబాబు, నాగ చైతన్య కూడా వారి ఇంటి కూతురి ఎంగేజ్మెంట్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
వరుణ్ తేజ్ కామెంట్
వరుణ్ తేజ్ అన్నయ్య అయినప్పటికీ నిహారికతో మాత్రం ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడని అందరికి తెలిసిన విషయమే. ఇక ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఇష్టపడేది కూడా తన చెల్లినే. ఇక తన బేబి నిశ్చితార్థం చేసుకుంది అంటూ తన బావకు హృదయపూర్వక స్వాగతం తెలియజేశాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది.

ఆమె మీ సమస్య
ఇక నాగబాబు కూడా తన కూతురిపై ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు పెళ్లికి సిద్ధమవ్వడంతో తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ పోస్ట్ చేశారు. 'ప్రతి ఒక్కరు చెబుతుంటారు తను చాలా విషయాల్లో నాలనే ఉంటుందని. నాకు నమ్మకం ఉంది తనపై నువ్వు అపారమైన ప్రేమను కురూపించగలవని. ఇక నేటి నుంచి ఆమె అధికారికంగా నీ సమస్య' అంటూ సరదాగా అల్లుడిపై కామెంట్ చేశారు.

మెగాస్టార్ దంపతులు సమక్షంలో
ఇక ఎంగేజ్మెంట్ వేడుకను హైదరాబాద్ లోని ఒక ప్రయవేట్ హోటల్ లో చాలా సింపుల్ గానే నిర్వహించారు. వేడుకలో కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది బంధువులు మాత్రమే కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి తన శ్రీమతి రేణుకతో కలిసి కుటుంబ పెద్దగా నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు.

పవన్ కళ్యాణ్ వచ్చారా లేదా?
ఇక రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, కూడా వారి భార్యలతో వేడుకలో పాల్గొన్నారు. ఇక యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మెగా సిస్టర్స్ కూడా నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వేడుకకు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చిందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఆయనకు సంబంధించిన ఫొటోలు అయితే ఇంతవరకు బయటకు రాలేదు.


Click it and Unblock the Notifications











