Nagabandham Trailer Review: నాగబంధం ట్రైలర్ రివ్యూ

భారతీయ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో నాగబంధం కూడా ఒకటి. కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోని నిధి, ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ నాగబంధం మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార కార్యక్రమాలు అంచాలను పెంచేశాయి. జూలై 3న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నాగబంధం యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. తాజాగా నాగబంధం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? లేదా అనేది పరిశీలిస్తే..

NagaBandham Trailer Review VFX Fantasy Elements Raise Expectations For Virat Karrna s Upcoming Film

అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డిలు నాగబంధం మూవీని నిర్మించగా.. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్, మహేశ్ మంజ్రేకర్, జగపతి బాబు, అనసూయ, మురళీ శర్మ తదదితరులు ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఎస్ సౌందర్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జునైద్ కుమార్, అభిలు సంగీతం అందించారు. ఆర్‌సీ ప్రణవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి నాగబంధం మూవీకి దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. ముఖ్యంగా ఈ సినిమా కోసం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పోలిన సెట్‌ను వేశారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, యానిమేషన్, సౌండ్ ఎఫెక్ట్స్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు.

ఇక నాగబంధం ట్రైలర్‌ను పరిశీలిస్తే.. అనంత పద్మనాభా స్వామి ఆలయంలో స్వామి వారి హృదయంలో నుంచి వచ్చిన బ్రహ్మకమలానికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎంత విలువైనది అయినా ఒక బంగారు పుష్పం కోసం ఉత్సవాలు చేస్తారా అని ఓ అమ్మాయి అడుగుతుంది. అది బంగారు పుష్పం కాదని దాని గురించి చెబుతూ ట్రైలర్‌ను ప్రారంభించారు. అది బ్రహ్మకమలం.. ఈ కాలవృక్షం నుంచి నన్ను విముక్తి చేయగల ఆ బ్రహ్మకమలం నా చేతిలో ఉంటే ఏ శక్తి నన్ను ఆపలేదని ఓ రాక్షసుడు ఆగ్రహంగా చెబుతాడు.

అయితే హీరోకి ఓ కోట, వేలాది పాములు తనను వెంటాడుతున్నట్లుగా కల వస్తుంది. తన వాళ్లని చంపుతున్న వ్యక్తితో ఆ బ్రహ్మకమలం ఎంత కష్టమైనా నేను తీసుకొస్తానని మాటిస్తాడు. అనంతరం పద్మనాభ స్వామి ఆలయంపై దుండగుల దండయాత్ర, నిధికి అడ్డుగా ఉన్న వారిని చంపడం చూపిస్తారు. ఈ నిధి కేవలం ప్రపంచాన్ని మాత్రమే శాసిస్తుంది. కానీ ఆ బ్రహ్మకమలం బ్రహ్మాండాన్నే శాసిస్తుంది, నాకు ఆ బ్రహ్మకమలం కావాలని ఆ రాక్షసుడు దొంగల నాయకుడికి చెబుతాడు.

దొంగల మారణకాండ, అకృత్యాలు పెరగడంతో అధర్మం మితిమీరినప్పుడు ధర్మరక్షణ కోసం భగవంతుడు అవతారం దాలుస్తాడని పూజారిగా ఉన్న మహేశ్ మంజ్రేకర్ చెబుతుండగా ఓ అఘోర వచ్చి బ్రహ్మకమలం దొంగలపాలు కాకుండా కాపాడతాడు. నాగబంధం వేయబడిన ఆలయానికి రక్షకులుగా నాగసాధువులు ఉన్నారని చెప్పగా.. ఇప్పుడు జరగబోయే నరమేధం గురించి చరిత్ర వారి రక్తంతో రాసుకోవాలని దొంగల ముఠా నాయకుడు తన వాళ్లకి చెబుతాడు. శివాలయాల్లో అడుగుపెట్టాలనే ఆలోచన వస్తే అస్తిపంజరాలు కూడా మిగలవని చూపిద్దామని హీరో అంటాడు.

మొత్తంగా చూస్తే అత్యంత మహిమాన్వితమైన బ్రహ్మకమలాన్ని దక్చించుకోవాలనే దుష్ట శక్తికి, దానిని కాపాడాలనుకునే రక్షకులకు మధ్య జరిగే పోరాటంగా నాగబంధం మూవీని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. విజువల్‌గా సినిమా గ్రాండియర్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అదిరిపోయాయి. సినిమాటోగ్రఫి, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తం మీద ఈ ట్రైలర్ నాగబంధం సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు.

Read more about: nabha natesh movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X