twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్ రాజాతో నవ మన్మధుడి పోటీ... సంక్రాంతి రేసులో కుర్రహీరోల హంగామా

    |

    సంక్రాంతి వస్తోందంటే సందడంతా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దే కనిపిస్తుంది. తెలుగు వారి పండగను మరింత రసవత్తరంగా మారుస్తూనే కాసుల పంట పండించుకోవడం ఎలాగో టాలీవుడ్ జనాలకు తెలిసినంతగా మరొకరికి తెలీదు. ఇక వచ్చే సంక్రాంతి కోసం అప్పడే తెలుగునాట హడావిడి మొదలైంది. కుర్రహీరోలందరూ పండగపై అప్పుడే కర్ఛీఫ్ వేసేస్తున్నారు.

    ఇప్పటికే నితిన్ రంగదే, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంక్రాంతి రేసులోకి ఎంటరైపోయాయి. కుర్రాళ్లిద్దరూ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పోటీపడేట్టు కనిపిస్తున్నారు. నితిన్, కీర్తీ సురేశ్ ల జోడీ ఎంత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుందో, అంతకన్నా కాస్త ఎక్కువగానే అఖిల్ పూజా హెగ్డే జంట ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక లాస్ట్ సంక్రాంతికి పూజా హెగ్డే ఖాతాలో ఓ భారీ హిట్ పడింది. దీంతో ఈ సంక్రాంతికి కూడా పూజ గట్టిగానే కొట్టేట్లు కనిపిస్తోంది.

    Nagachaitanya, Raviteja movies to release on Sankranthi

    మరోవైపు, నితిన్, అఖిల్ కు పోటాపోటీగా నాగ చైతన్య, మాస్ మహారాజ్ కూడా సంక్రాంతిపైనే కన్నేశారని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న నాగ చైతన్య సాయి పల్లవిల లవ్ స్టోరీ సంక్రాంతికి ముహూర్తం ఖరారు చేసుకుందని తెలుస్తోంది.

    ఇక మాస్ మహారాజ్ సైతం శ్రుతిహాసన్ సమేతంగా పందెంకోళ్లతో సహా బరిలోకి దిగిపోతున్నాడు. క్రాక్ ను సంక్రాంతికే విడుదల చేయాలని దర్శక-నిర్మాతలు భావిస్తున్నారు. మరి కుర్రాళ్లతో పోటీపడేందుకు సై అంటోన్న మాస్ మహారాజ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

    English summary
    Films gearing up to release Sankranthi as All the young hero's from tollywood decked up to release their new films next sankranthi. Chai and Raviteja also joins in.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X