twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత -నాగ చైతన్య విడాకుల పుకార్ల నేపధ్యంలో అమీర్ ఖాన్ మద్దతు.. చైతూ ఏమన్నాడంటే ?

    |

    సౌత్ సూపర్ స్టార్స్ నాగచైతన్య మరియు సమంత అక్కినేని తమ విడాకుల పుకార్ల విషయంలో గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. నటీనటులు ఇద్దరూ దేనినీ ధృవీకరించనప్పటికీ, ఇద్దరి మధ్య విషయాలు సజావుగా లేవని మరియు వారు విడాకులు తీసుకోవచ్చని ప్రచారం అయితే జరుగుతోంది. అయితే అమీర్ ఖాన్ మరియు కరీనా కపూర్ ఖాన్ జంటగా రూపొందుతున్న లాల్ సింగ్ చద్దా లతో కూడా చైతన్య తన బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నారు. ఈ విడాకుల వార్తల నేపథ్యంలో అమీర్ ఖాన్ చైతన్య సినిమా విషయంలో తన మద్దతు అందించారు. అయితే ఈ విషయమే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే

    ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసి

    ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసి


    నాగ చైతన్య మరియు సాయి పల్లవి యొక్క తాజా చిత్రం లవ్ స్టోరీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, అమీర్ ఖాన్ మాట్లాడుతూ, "నేను ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చా అని నాగ చైతన్యని అడిగాను, అని నిర్వాహకులు నన్ను బలవంతంగా ఆహ్వానించడానికి కారణం అదే అని చెప్పుకొచ్చాడు. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను, మేమిద్దరం కలిసి సినిమా కోసం పని చేస్తున్నాం. నేను నాగ చైతన్యతో కొన్ని అనుభవాలను కలిగి ఉన్నా, వాటిని నేను అతని తల్లిదండ్రులతో పంచుకోవాలనుకున్నాను అని పేర్కొన్నారు.

    నంబర్స్ కూడా తీసుకున్నాంటూ

    నంబర్స్ కూడా తీసుకున్నాంటూ


    దాని కోసం నేను అతని తండ్రి నంబర్ మరియు అతని తల్లి నంబర్ కూడా తీసుకున్నాను కానీ నేను అతని అభిమానులందరికీ కూడా ఇది చెప్పాలనుకున్నాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని పేర్కొన్నారు. నాగచైతన్య ఓ నటుడే కాదు. మంచి మనసున్న మనిషి అని ఆ రెండు లక్షణాలు నన్ను కట్టిపడేశాయి అని పేర్కొన్నారు.

    చైతూ ఏమన్నాడంటే

    చైతూ ఏమన్నాడంటే

    తాజాగా అమీర్ మాటలకు నాగచైతన్య స్పందించారు. ఒక పోర్టల్‌తో మాట్లాడుతూ అది మరచిపోలేని విషయం అని ఆయన అన్నారు. "ఆయన అసలు రావాల్సిన అవసరం లేదు అలాగే నేను చేసిన పనులు అతను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఊహించనిది. అమీర్ సర్ నా కొత్త సినిమా లవ్ స్టోరీ ట్రైలర్ చూసి టీమ్‌కు సపోర్ట్ చేయడానికి అక్కడ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారని అలా ఈవెంట్‌లో ఆయన రావడం ఒక మేజిక్ లాగా ఉందని పేర్కొన్నారు.

    అమీర్ ఖాన్ సపోర్ట్ తో

    అమీర్ ఖాన్ సపోర్ట్ తో

    ఆయన చాలా దయగల వ్యక్తి. లాల్ సింగ్ చద్దా షూటింగ్ సమయంలో నేను ఆయన నుంచి అందుకున్న ఆతిద్యం మాటల్లో చెప్పడం చాలా కష్టం, "అని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇటీవలే రెండో సారి విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ విడాకుల వార్తల్లో నిలుస్తున్న చైతన్యకు సపోర్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

    Recommended Video

    Director Sekhar Kammula Exclusive Interview About 'Love Story' | Part 3
    మరికొన్ని గంటల్లో

    మరికొన్ని గంటల్లో

    ల‌వ్ స్టోరీ ఇంకొన్ని గంట‌ల్లో విడుదల కాబోతోంది. ఈ నేపదంలో టెన్ష‌న్ గా ఫీల‌వుతున్నారా, లేదంటే న‌మ్మ‌కంతో ఉన్నారా? అని అడిగితె సినిమా క‌థ‌పై నాకు చాలా న‌మ్మకం ఉంది కానీ థియేట‌ర్ రెస్పాన్స్ గురించి ఆలోచిస్తే టెన్ష‌న్ గా ఉంది అని చైతన్య పేర్కొన్నారు. మూడు రోజుల అడ్వాన్స్ బుకింగ్ లెక్క‌లు సంతృప్తినిస్తున్నాయన్న చైతూ సోమ‌వారం నుంచి ఎలా ఉంటుందో చూడాలని పేర్కొన్నారు.

    English summary
    Naga Chaitanya Responds to Aamir Khan Supporting Him Amid Divorce Rumours for love story movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X