మన్మధుడు 2 గురించి హింట్ ఇచ్చిన నాగార్జున.. బంగార్రాజు కూడా!
ఇటీవలే దేవదాస్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాగార్జున త్వరలో ఆసక్తి రేకెత్తించే చిత్రాలలో నటించబోతున్నారు. ప్రస్తుతం నాగార్జున తమిళంలో ధనుష్ రూపొందిస్తున మల్టీస్టారర్ చిత్రం, హిందీలో బ్రహ్మాస్త్ర చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజగా తన తదుపరి చిత్రాల గురించి నాగ్ మాట్లాడుతూ మన్మధుడు2 గురించి హింట్ ఇచ్చాడు.
సోగ్గాడే చిన్నినాయనా చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బంగార్రాజు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని తాజగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున తెలిపాడు. అదే విధంగా రాహుల్ రవీంద్రన్ దర్శత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రం ప్లాన్ చేస్తున్నామని వివరించాడు. ఈ చిత్రానికి మన్మధుడు 2 అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు చిత్రాలలో ఏది ముందుగా ప్రారంభం అవుతుందో ఇప్పుడే చెప్పలేనని నాగార్జున అన్నారు. ఇకపై వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటానని నాగ్ తెలిపారు. రాహుల్ రవీంద్రన్ చిలసౌ చిత్రంతో ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


Click it and Unblock the Notifications











