అనుష్క శెట్టితో అఫైర్.. నాతోపాటు, నా కొడుకు కూడా లింకులా? నాగార్జున ఏమన్నారంటే?

టాలీవుడ్‌లో రోమాంటిక్ హీరో ఇమేజ్ కొంతమందికే ఉంది. వారిలో కింగ్ నాగార్జున ఒకరు. దిగ్గజ నటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్థాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను నాలుగు స్తంభాలుగా మోస్తున్న ఒకరిగా స్థానం సంపాదించారు. మాస్ చిత్రాలతో యువతకు పూనకాలు తెప్పించినా, భక్తిరస చిత్రాలతో ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తినా నాగార్జునకే చెల్లింది.

అమ్మాయిల కలల రాకుమారుడిగా, యువ సామ్రాట్‌గా తెరపై సందడి చేశారు నాగ్. రోటిన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథల్లో నటిస్తూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలు చేస్తూ న్యూటాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సెల్యూలాయిడ్ సైంటిస్ట్‌గా నాగార్జున గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 60 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో.. నవ మన్మథుడిగా , కుర్రాళ్లే అసూయ పడేంత అందంతో అలరిస్తున్నారు.

Nagarjuna Akkineni clarity on Affair with Anushka Shetty and other heroines

సినిమా పరిశ్రమపై రకరకాల గాసిప్స్ ఎప్పుడూ ప్రచారంలో ఉంటూనే ఉంటాయి. హీరోహీరోయిన్లు కాస్తంత క్లోజ్‌గా ఉన్నా సరే ఏదో ఒక అఫైర్ అంటగట్టేస్తూఉంటారు పుకారు రాయుళ్లు. నాగార్జున సైతం దీనికి అతీతం కాదు. తొలినాళ్లలోనే ఆయన చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడుపుతున్నారంటూ రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. డాక్టర్ డీ.రామానాయుడు కుమార్తె లక్ష్మీతో నాగార్జున వైవాహిక జీవితం, విడాకులు నేపథ్యంలో ఎన్నో రూమర్స్ , చెవులు కొరుక్కోవడాలు జరిగాయి.

తర్వాతి కాలంలో టబు , శ్రీయా , మనీషా కొయిరాల, పూజా బాత్రా, అనుష్క శెట్టిలతో నాగార్జునకు సంబంధాలు అంటగట్టారు. కాలం గడిచేకొద్ది ఇలాంటి వాటికి అడ్డుకట్టపడక పోగా.. నాగ్ విషయంలో ఇవి మరింత ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా టబు, అనుష్కలతో నాగార్జున డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చేవి. ఎన్నోసార్లు ఇవి గాలివార్తలే తప్పించి, వీటిలో పస లేదని తేలింది. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జునను హీరోయిన్లతో ప్రేమాయణాలపై యాంకర్ ప్రశ్నించారు.

Nagarjuna Akkineni clarity on Affair with Anushka Shetty and other heroines

టబు హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటుందని, మా ఇంటికి ముందున్న ఫ్లాట్ టబుకి తన భార్య అమల దగ్గరుండి కట్టించిందని నాగ్ చెప్పారు. సినిమాల్లోకి రాకముందు నుంచే టబుతో తనకు ఫ్రెండ్‌షిప్ ఉందని చెప్పారు. టబు నా బెస్ట్ కో ఆర్టిస్ట్.. నా ఫేవరేట్ హీరోయిన్ ఎవరని అడిగితే ఆమె పేరే చెబుతానని, తను మా ఫ్యామిలీలో ఓ మెంబర్ అని నాగార్జున వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో అగ్రకథానాయిక అనుష్కతో తనకు అఫైర్ ఉందంటూ జరుగుతున్న ప్రచారంపైనా నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

స్వతహాగా తాను చాలా హైట్‌గా ఉంటానని, అలాంటిది తన పక్కన పొట్టిగా ఉన్న అమ్మాయిల కంటే హైట్‌గా ఉండేవాళ్లే బాగుంటారని ఆయన చెప్పారు. అందుకే దర్శక నిర్మాతలకు పొడుగ్గా ఉండే హీరోయిన్లను తీసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటానని , జోడీ బాగుంటుందని అనుష్కనే రిపీట్ చేసేవాడినని నాగ్ తెలిపారు. అలాంటిది నాకు అనుష్కకు మధ్య లేనిపోనివి అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనతోనే కాకుండా తన కుమారుడు నాగచైతన్యకు అనుష్కకు మధ్య ఏదో ఉందంటూ ప్రచారం చేస్తున్నారని నాగ్ ఫైర్ అయ్యారు. సమాజం పాడైపోతోందని.. ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు మాట్లాడుకుంటున్నారని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. చైతూ కంటే అనుష్క వయసులో పెద్దవారని , దీనికి తోడు అతని కంటే కూడా హైట్ అని .. మరి ఎలా సెట్ అవుతుందని ఇలాంటి రాతలు రాస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ ఓ విషయంలో కింగ్‌ను మెచ్చుకుని తీరాలి. ఏళ్లుగా తనకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నా, లేనిపోనివీ కల్పించి రాస్తున్నా ఎవరిపైనా నాగ్ సీరియస్ అయిన దాఖలాలు లేవు. ముఖంపై చెరగని చిరునవ్వు తప్పించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొన్నాళ్లకు అవి అవాస్తవాలని జనం తెలుసుకుంటారని నాగార్జున నమ్మకం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X