ANR Biopic: నాన్న జీవితాన్ని సినిమాగా తీయాలని ఉంది... కానీ ఆ భయంతో.. నాగార్జున ఎమోషనల్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని నటించిన వైల్డ్ డాగ్ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్మాత నిరంజన్ రెడ్డి సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జునతోపాటు చిత్ర యూనిట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కినేని నాగేశ్వర్ రావు బయోపిక్ గురించి ప్రశ్నకు నాగ్ ఎమోషనల్ స్పందిస్తూ...
నిధి అగర్వాల్ క్లీవెజ్ షో... అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరి
నాన్న గారి బయోపిక్ చేయాలనే కోరిక నా మనసులో ఉంది. కానీ ఎలా తీస్తామో అనే భయం నన్ను వెంటాడుతున్నది. ఏమన్నా తప్పు చేస్తున్నామా? ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. మనసులో భయం ఉంటే తప్పకుండా మంచి సినిమా తీస్తాం. మనం సినిమాను కూడా అలాగే భయంతో తీసాం. అది ఎలాంటి విజయం సాధించిందో మనకు తెలుసు. త్వరలోనే ఏఎన్నాఆర్ బయోపిక్ తీసే అవకాశం ఉంది అంటూ నాగార్జున సమాధానం ఇచ్చారు.

అలాగే వైల్డ్ డాగ్ సినిమాపై సమంత, అమల ట్వీట్లు చేయడంపై స్పందిస్తూ.. చాలా హ్యాపీగా ఉంది. అందుకే వాళ్లను ఫ్యామిలీ అన్నారు. మంచి, చెడు సమయాల్లో అండగా ఉంటారు అని నాగార్జున పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











