అమల పక్కన ఉండగానే మృణాల్‌తో లవ్‌లో పడ్డా.. చాలా ఈర్ష్యగా ఉంది.. నాగార్జున హాట్ కామెంట్స్
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో నటించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్న నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ సీతారామం థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో నాగార్జున అక్కినేని మాట్లాడుతూ..

స్వప్న, ప్రియాంకను ఎక్కువగా ప్రేమిస్తా
సీతారామం సినిమా సక్సెస్ మీట్‌కు ఆహ్వానించినందుకు అశ్వినీదత్తుకు ధన్యవాదాలు. నా గురించి మంచి మాటలు చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. దత్తు గారి కంటే నేను స్వప్న, ప్రియాంకను ఎక్కువగా ప్రేమిస్తాను. చిన్నప్పటి నుంచి వారిద్దరు నాకు తెలుసు. దత్తు గారి ఎంతో అండగా నిలుస్తారు. మహానటి, జాతిరత్నాలు, సీతారామం సినిమాలను అదించారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని నాగార్జున అన్నారు.

దేవుడి ఆశీర్వాదం మీకు..
వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో నేను ఐదు సినిమాలు చేశాను. మా నాన్న గారు నటించారు. చిరంజీవి నాలుగు సినిమాలు చేశారు. ఈ బ్యానర్‌లో చేయని వారు లేరు. ఆ బ్యానర్ పేరును మీరు నిలబెడుతున్నారు. దేవుడి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది.

జెలసీగా ఫీలయ్యాను అంటూ
సీతారామం సినిమాను చూసి నేను చాలా జెలసీగా ఫీలయ్యాను. నాకు రావాల్సిన రామ్ క్యారెక్టర్ దుల్కర్ సల్మాన్‌కు వెళ్లింది. ఈ సినిమా చూసిన తర్వాత నా పాత సినిమాలు గీతాంజలి, సంతోషం,మన్మథుడు గుర్దొచ్చాయి. రొమాంటిక్ సినిమాలకు మళ్లీ ఆదరణ పెరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమ కథా చిత్రాలు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే.. వాళ్లు మళ్లీ మళ్లీ చూస్తారు. ఆ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తారు. దానిని క్లాసిక్‌గా మలుస్తారు అని నాగార్జున అన్నారు.

ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి
సీతారామం సినిమా దర్శకుడు హను రాఘవపూడిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. సినిమాలో డీటేయిలింగ్ బాగున్నాయి. నటీనటుల నుంచి టాలెంట్ రాబట్టకోవడం చూసి ఆనందం కలిగింది. సీత క్యారెక్టర్ బాగున్నది. మృణాల్ క్యారెక్టర్.. కథలోకి మతాన్ని తెచ్చి ఆకట్టుకొన్నావు. ఇంటర్వెల్ పాయింట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశావు. ఇలాంటి థాట్ ప్రాసెస్‌తో సినిమా తీయడానికి ధైర్యం కావాలి. ఇంతంటి సృజనాత్మక సినిమాను చూసి చాలా రోజులైంది.

మృణాల్‌ను చూసి లవ్‌లో పడ్డాను
సీతారామంలో సీతా మహాలక్ష్మీ పాత్రలో మృణాల్‌ను చూసి ప్రేమలో పడ్డాను. అమలతో కలిసి సినిమా చూసేటప్పడు.. ఎవరీ ఈ అమ్మాయి.. ఇంత అందంగా ఉందని అని పదే పదే అడిగాను. సీత పాత్రలో మృణాల్‌ను చూపించిన విధానం అద్బుతంగా ఉంది. సీత పాత్రకు వాడిన దుస్తులు చాలా బాగున్నాయి. ఈ సినిమాలో చీరెలు నాకే బాగా నచ్చాయంటే.. ఆడవాళ్లకు ఎంత నచ్చుతాయో నాకే తెలియడం లేదు అని అన్నారు.

ప్రేక్షకులకు పాదాభివందనం
దుల్కర్ సల్మాన్ గొప్ప ఛార్మింగ్ ఉన్న నటుడు. దుల్కర్‌ను చూడగానే ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది.దుల్కర్‌లో ఆ స్వచ్ఛత ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటాను. సీతారామం సినిమాను పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. గతవారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు. సీతారామం సినిమాకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందని స్వప్న చెప్పడం ఆనందంగా వుంది. అశ్వీని దత్ గారు సినిమా థియేటర్‌కు మళ్ళీ ఆడియన్స్‌ను తీసుకొచ్చి మా అందరికీ మళ్ళీ నమ్మకం కలిగించారు. సీతారామంను ఇంత గొప్ప ఆదరించిన ప్రేక్షకులకులందరికీ మరోసారి కృతజ్ఞతలు అని నాగార్జున అన్నారు.


Click it and Unblock the Notifications











