Naga Chaitanya Engagement: కోడలు శోభితా గురించి నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో ట్రెండింగ్!
అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వ్యవహారం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. సమంతతో విడిపోయిన తర్వాత చైతూ తన ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటూ, తన సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. దీంతో ఆయన తన జీవితంలోకి మరొక స్త్రీని ఆహ్వానిస్తారా లేదా , అనే డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో చైతూ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
అలాంటిది ఈ జంట ఇవాళ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నాగచైతన్య, శోభిత నిశ్చితార్ధం జరగనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు అక్కినేని కుటుంబం కానీ , ఇటు శోభిత ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే శోభిత గురించి నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

శోభిత- చైతూ ప్రేమలో ఉన్నారని గతంలో ఎన్నోసార్లు గాసిప్స్ చక్కర్లు కొట్టినా ఇద్దరూ వాటిపై స్పందించలేదు, కనీసం ఖండించనూ లేదు. అయితే నిప్పు లేకుండా పొగరాదు కదా అని వీరి రిలేషన్‌పై అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అలాంటిది ఈసారి ఏకంగా ఎంగేజ్‌మెంట్ అనేసరికి ఎక్కడో తేడా కొడుతోంది. స్వయంగా నాగార్జున స్పందిస్తే కానీ ఈ పుకార్లకు చెక్ పడే అవకాశాలు కనిపించడం లేదు. ఏది ఏమైతేనేం నాగచైతన్య ఓ ఇంటివాడైతే అంతకన్నా కావాల్సిందేముందని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
అయితే నాగచైతన్య, శోభితా ఎంగేజ్ మెంట్ వార్తల నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసిన వివరాలు ఏమిటంటే.. ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్‌మెంట్ జరగడం లేదు. కానీ రెండు కుటుంబాలు సంప్రదాయ పద్దతిలో కలిసి మాటముచ్చట చేసుకోనున్నారు. ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్ గురించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అని తెలిపారు. ఏదో సమయంలో అధికారికంగా ప్రకటన రావొచ్చని పేర్కొన్నారు.
ఇలాంటి వార్తల నేపథ్యంలో శోభితా గురించి నాగార్జున అక్కినేని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శోభిత, అడవి శేష్ నటించిన గూఢచారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభిత గురించి హాట్ కామెంట్స్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

నాగార్జున మాట్లాడుతూ.. శోభిత గురించి ఏం చెప్పాలి? ఆమె సో గుడ్.. నేను ఇలా మాట్లాడటం తగదు. కానీ ఆమె చాలా హాట్. ఆమెను చూస్తే మాటల్లో చెప్పలేని ఎట్రాక్షన్ కనిపిస్తున్నది. శోభితను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అని నాగార్జున ఆమెపై ప్రశంసలు గుప్పించిన వీడియో ట్రెండ్ చేస్తున్నారు.
అప్పుడు నాగార్జున ఆమె గురించి చెప్పిన మాటలు యధాలాపంగానే అనిపిస్తాయి. కానీ నిశ్చితార్థం వార్తల నేపథ్యంలో కోడలి గురించి ఆయన చెప్పిన మాటలు మాత్రం ఇబ్బందికరంగా మారాయి. ఆమెపై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











