twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju's OTT release.. నాగార్జున అక్కినేని మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?

    |

    సంక్రాంతి బరిలో దూకిన బంగర్రాజు రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్నాడు. సొగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రంలో నాగార్జున, నాగచైతన్య జంటగా నటించి మెప్పించారు. బంగార్రాజు, చిన్న బంగార్రాజు పాత్రలను రూపొందించిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ‌ ప్రశంసలు అందుకొంటున్నారు. థియేటర్లలో కలెక్షన్ల దుమ్ము దులుపుతున్న ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతున్నదంటే?

    ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే

    ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే


    సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తేదీన బంగార్రాజు చిత్రం థియేటర్‌లో రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం ప్రతీ షోకు వసూళ్లను పెంచుకొంటూ పోతున్నది. మూడు రోజుల్లోనే నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.

    భారీ కలెక్షన్లతో బంగార్రాజు

    భారీ కలెక్షన్లతో బంగార్రాజు

    సంక్రాంతి పండుగ సానుకూలతను పాజిటివ్‌గా మలచుకొన్న బంగార్రాజు చిత్రం తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 9.06 కోట్లు, రెండో రోజున 7.79 కోట్లు, మూడో రోజున 6.72 కోట్లు సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌కు లిట్మస్ టెస్ట్‌గా మారిన సోమవారం కూడా భారీ వసూళ్లను, అక్యుపెన్సీని సొంతం చేసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల గ్రాస్

    ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల గ్రాస్

    ఇక బంగార్రాజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను పరిశీలిస్తే.. ఈ చిత్రం మూడు రోజుల్లో 53 కోట్ల గ్రాస్, 30 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంలో ఓ మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రం ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం ఇదే మొదటిసారి. కరోనావైరస్ పరిస్థితులను ఎదరిస్తూ వెళ్తున్న ఈ చిత్రం తొలి వారం ముగిసే నాటికి 39 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

    జీ, అన్నపూర్ణ బ్యానర్లపై బంగార్రాజు

    జీ, అన్నపూర్ణ బ్యానర్లపై బంగార్రాజు

    బంగార్రాజు చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు రూపొందించాయి. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న టికెట్ల రేట్ల వివాదానికి పట్టించుకోకుండా ధైర్యంగా ఈ చిత్రాన్ని నిర్మాతలు నాగార్జున, ప్రసాద్ రిలీజ్ చేశారు. తక్కువ బడ్జెట్‌తో తక్కువ సమయంలో ఈ సినిమాను రూపొందించి లాభాల్లోకి దూసుకెళ్లున్నారు.

    ఫిబ్రవరి మూడో వారంలో రిలీజ్

    ఫిబ్రవరి మూడో వారంలో రిలీజ్

    ఇదిలా ఉండగా, బంగార్రాజు చిత్రాన్ని జీ 5లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయంగా ఈ సినిమాను జీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొదించడంతో జీ 5 ఓటీటీలో 30 రోజుల తర్వాత సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సినిమా రిలీజ్ చూసుకొంటే ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

    English summary
    Tollywood hero Nagarjuna Akkineni's Bangarraju doing good at Box office. This movie hits screens on January 14th. This movie set to release on February Third week
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X