పెను ప్రమాదం నుంచి తప్పించుకొన్న నాగార్జున.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ నటుడు, టాలీవుడ్ మన్మథుడు, బిగ్‌బాస్ తెలుగు హోస్ట్ నాగార్జున అక్కినేని పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆకస్మికంగా వరదలు ముంచెత్తడంతో చాలా సేపు ఆయన వాహనం వాగునీటిలో చిక్కుకుపోయింది. అయితే అధికారులు సకాలంలో స్పందించడంతో వెంట్రుకవాసిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకొన్నారు అని స్థానికులు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే..

అనంతపురంలోని జ్యువెలరీ షాప్‌ ప్రారంభోత్సవానికి నాగార్జున వెళ్లారు. ఆయన పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురానికి బయలుదేరారు. అయితే గత రాత్రి భారీ వర్షం కురియడంతో పడమేరు వాగు ఉప్పొంగింది. అనూహ్యంగా నీటి ప్రవాహం పెరగడంతో ఆ తాకిడికి నాగార్జున వరద నీటిలో చిక్కుకుపోయారు.

Nagarjuna Akkineni shockingly escapes from Floods at anantapur

అయితే డ్రైవర్ అప్రమత్త, అధికారులు చొరవతో నాగార్జున సురక్షితంగా వరద ప్రవాహం నుంచి బయటకు వచ్చారు. ఆయన రాకతో స్థానికంగా ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. అధికారులు భద్రత కల్పించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆయనను చూసేందుకు స్థానికులు ఎగపడ్డారు. ఆయన చాలా సహనంతో అభిమానులతో ఫోటోలు దిగారు.

బెంగళూరు, అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. బెంగళూరు, హైద్రాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు ఇండ్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూడటం జరిగింది. ఈ క్రమంలో వరద నీరులో చిక్కుకొన్న నాగార్జునను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి.. ఆయనను రూట్ మళ్లించి పంపించారు. ఈ సందర్భంగా స్థానికులకు, అధికారులకు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.

Nagarjuna Akkineni shockingly escapes from Floods at anantapur

అక్కినేని నాగార్జున కెరీర్ విషయానికి వస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే కుబేరా చిత్రంలోను, అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమాలో నటిస్తున్నారు. కూలీలో ఆయన విలన్ పాత్రలో నటించనున్నారు. కుబేరాలో ధనుష్, రష్మిక మందన్నతో కలిసి నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X