The Ghost First Review.. ఉమేర్ సంధూ రేటింగ్ ఎంతంటే?? నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్
గరుడవేగ తర్వాత స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్ మూవీతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నాగార్జున అక్కినేని, సోనాల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్లుగా నటించారు. సరికొత్త కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కిందనే విషయాన్ని హీరో నాగార్జున అక్కినేని మీడియాతో పంచుకొన్నారు.ఈ సినిమా గురించి దుబాయ్‌కి చెందిన ఉమేర్ సంధూ అనే క్రిటిక్, సెన్సార్ బోర్డు సభ్యుడు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఉమేర్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

వివాదాస్పద రివ్యూలతో
ఉమేర్ సంధూ సోషల్ మీడియాలో పోస్టు చేసే రివ్యూలు వివాదాస్పదంగా ఉంటాయి. అయితే ఏ సినిమా గురించి కూడా పర్‌ఫెక్ట్ రివ్యూలు ఇచ్చిన దాఖలాలు లేవు. తెలుగు సినిమాతో ఏ మాత్రం సంబంధంలేని ఈ క్రిటిక్ టాలీవుడ్ గురించి ప్రత్యేకంగా అప్‌డేట్స్ ఇస్తుంటారు.

దుబాయ్‌లో సెన్సార్ బోర్డు మెంబర్‌గా
ఉమేర్ సంధూ దుబాయ్‌లో సెన్సార్ బోర్డు మెంబర్‌గా సోషల్ మీడియాలో తన స్టేటస్ అప్‌డేట్ చేసుకొన్నాడు. ప్రతీ సినిమాకు ముందు సెన్సార్ బోర్డు రిపోర్టు అంటూ తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత ఆయన రివ్యూలు వాస్తవానికి ఆమడదూరంలో ఉంటాయి.
ది ఘోస్ట్ గురించి పోస్టు
ఉమేర్ సంధూ తాజాగా ట్విట్టర్‌లో ది ఘోస్ట్ మూవీ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. సెన్సార్ బోర్డు నుంచి ది ఘోస్ట్ ఫస్ట్ రివ్యూ ఇది. టాలీవుడ్‌లో ఇది బీ గ్రేడ్ మాస్ మసాల సినిమా. స్టోరి, స్క్రీన్ ప్లే బోరింగ్. పెద్దగా ఆకట్టుకోవు అంటూ ఉమేర్ ట్వీట్ చేశాడు.

ఉమేర్‌ను దారుణంగా ట్రోలింగ్
అయితే ఉమేర్ సంధూ రివ్యూను నమ్మకండి అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఉమేర్ రివ్యూను భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వ్యక్తి ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను నమ్మకండి. వీడివి బోస్ డీకే రివ్యూలు. ఫేక్ రివ్యూలు ఇస్తుంటాడు అని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే గతంలో ఉమేర్ సంధూ రివ్యూలన్నీ వాస్తవానికి దూరంగా ఉండటంతో.. ఆయన రివ్యూలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రవీణ్ సత్తారు, నాగార్జున కాంబినేషన్
ఇదిలా ఉంటే.. ది ఘోస్ట్ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రవీణ్ సత్తారు, నాగార్జున కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ వర్గాల వెల్లడించిన ప్రకారం.. తెలుగులో స్టైలిష్, యాక్షన్ ఫిలిం అని చెప్పుకొంటున్నారు. అయితే ఈ సినిమా గురించిన ఫర్‌ఫెక్ట్ రివ్యూ గురించి తెలుగు ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..


Click it and Unblock the Notifications











