బ్రహ్మస్త్ర గురించి నాగార్జున క్రేజీ ట్వీట్.. అలియా, రణ్‌బీర్‌తో గొప్ప అనుభూతి అంటూ...
ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ తన సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలిసి రూపొందిస్తున్న చిత్రం బ్రహ్మస్త్ర. ఈ చిత్రానికి దర్శకుడు ఆయన్ ముఖర్జీ. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, నాగార్జున, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మౌనీ రాయ్ నటిస్తుండగా, షారుక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
అయితే తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ట్విట్టర్‌లో బ్రహ్మస్త్ర షూటింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అలియాభట్, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. బ్రహ్మస్త్ర చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగిసిందని ట్వీట్ చేశారు.

నా పాత్రకు సంబంధించిన బ్రహ్మస్త్ర షూటింగు ముగిసింది.అద్భుతమైన ఫెర్ఫార్మర్స్ రణ్‌బీర్, అలియా భట్‌తో కలిసి నటించడం గొప్ప అనుభూతిని పొందాను. ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఎప్పుడెప్పుడూ చూడాలా అని ఎదురు చూస్తున్నాను. ఆయన్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు అంటూ నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు.
బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో ఓ భారీ సెట్ లో నడుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల అవుతాయి.

తారాగణం: అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, నాగార్జున, రణబీర్ కపూర్, అలీయభట్, ప్రతీక్ బబ్బర్, దివ్యేందు తదితరులు
దర్శకుడు - అయాన్ ముఖర్జీ
నిర్మాతలు: హీరూ యాష్ జోహర్, కరణ్ జోహర్, రణ్‌బీర్ కపూర్, ఆయన్ ముఖర్జీ, అపూర్వ మెహతా తదితరులు
మ్యూజిక్: ప్రీతమ్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, అఖివ్ అలీ, మానిక్ దావర్
బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్


Click it and Unblock the Notifications











