నాగార్జున, ధనుష్‌ల సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. కింగ్ రోల్ కూడా లీక్!

సెన్సేషనల్ లవ్ స్టోరీస్ తో కుర్రకారు మదిని మెదిలించే సూపర్ డూపర్ హిట్టు సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన తీసిన అన్ని సినిమాలు లవ్ స్టోరీస్ యే. ముఖ్యంగా ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ.. ఇలా అన్నీ చాలా సాఫ్ట్ గా ఉండే సూపర్ సక్సెక్ స్టోరీసే. అయితే ఆయన తాజాగా తన రూటు మార్చుకున్నారు. కొత్తగా యాక్షన్ వైపు మళ్లారు. ఈక్రమంలోనే నాగార్జున, ధనుష్ లతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసి విడుదల చేశారు. ఆ వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. ధనుష్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో నాగార్జున ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని పట్టాలెక్కింది. ధనుష్ హీరోగా రాబోతున్న ఈ 51వ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇక ఈ మూవీకి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ వ్యవహారిస్తున్నారు. అలాగే సోనాల్ నారంగ్ సమర్పణలో శేఖర్ కమ్ములకు చెందిన అమిగోల్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాలో పతాంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Nagarjuna And Dhanush Combo Film Title Fixed Check Details

ఇవన్నీ ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ ను వదిలి అందరిలోనూ ఆసక్తి కల్గించారు చిత్ర బృందం. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాకు ఆసక్తికర టైలిట్ ను పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమా పేరును ముంబై పట్టణంలోనే ఓ స్లమ్ పేరు పెట్టారు. అదేంటంటే.. ముంబైలో ఉన్న "ధారావి" ప్రాంతం పేరునే సినిమాగా మలించారు. ధారావి సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున పాత్రను కూడా లీక్ చేశారు.

Nagarjuna And Dhanush Combo Film Title Fixed Check Details

అయితే ఆయన గతంలో కనిపించిన ఓ అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై డాన్ గా నాగార్జున మరోసారి సినీ ప్రియులను అలరించబోతున్నారని సమాచారం. ఇప్పటికే డాన్ సినిమాతో పాటు, నాని, నాగార్జునలు హీరోలుగా వచ్చిన దేవదాస్ సినిమాలోనూ నాగార్జున మాఫియా డాన్ గానే కనిపించారు. మరోసారి ఆయన డాన్ గా కనిపించనుండగా.. ధనుష్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X