Bangarraju Teaser: కొడుకుతో కలిసి వచ్చిన సోగ్గాడు.. టీజర్‌తో అంచనాలు పెంచిన బంగార్రాజు

కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త నేపథ్యాలు, ప్రయోగాలతో చిత్రాలు చాలానే వస్తున్నాయి. అందులో మల్టీస్టారర్ మూవీలు కూడా ఉన్నాయి. ఇలా వచ్చిన వాటిలో చాలా వరకు సూపర్ డూపర్ హిట్లుగా నిలవడంతో దర్శక నిర్మాతలు, హీరోలు మరింత ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడిలా వస్తున్న చిత్రాల్లో 'బంగార్రాజు' ఒకటి. నాలుగేళ్ల క్రితం సూపర్ డూపర్ హిట్ అయిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు.

'సోగ్గాడే చిన్ని నాయన' సూపర్ హిట్ అవడంతో.. కొన్నేళ్లకు 'బంగార్రాజు' ప్రాజెక్టును చేయాలని నాగార్జున భావించాడు. అందుకు అనుగుణంగానే ఆ మూవీ బాధ్యతను దర్శకుడు కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు. అంతేకాదు, దీన్ని అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా రూపొందించాలని కూడా సూచించాడు. కానీ, స్క్రిప్ట్ సరిగా లేకపోవడం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో ఈ సినిమా స్టార్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీన్ని అధికారికంగా మొదలు పెట్టేశారు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నాగార్జున ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించి.. వేగంగానే పూర్తి చేసేశారు.

Nagarjuna and Naga Chaitanya Starrer Bangarraju Movie Teaser Released

తండ్రి కొడుకుల కాంబినేషన్‌లో సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్ జరుపుకుంటుండగానే ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించేశారు. ఇప్పటికే కొన్ని ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేశారు. అలాగే, ఆ తర్వాత గ్లిమ్స్ వీడియోను సైతం రిలీజ్ చేశారు. వీటితో పాటు కొన్ని పాటలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. వీటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ భారీ మల్టీస్టారర్ మూవీ నుంచి టీజర్‌ను కూడా వదిలారు.

స్వర్గంలో ఉన్న బంగార్రాజు మళ్లీ తన ఇంట్లోకి వచ్చిన విజువల్స్‌తో 'బంగార్రాజు' టీజర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత అతడి మనవడిగా అక్కినేని నాగ చైతన్యను పరిచయం చేశారు. అతడి క్యారెక్టర్ కూడా బంగార్రాజును పోలినట్లే అమ్మాయిలను ఫ్లట్ చేసినట్లు చూపించారు. అలా సరదాగా సాగిపోతోన్న సమయంలో ఏదో ఒక సమస్య వచ్చినట్లు, దాన్ని అధిగమించేందుకు నాగ చైతన్య పోరాటం చేస్తున్నట్లు ఈ టీజర్‌లో చూపించారు. మొత్తంగా ఇది ఫన్నీగా మొదలై థ్రిల్‌తో ఎండ్ అయింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. దీంతో ఇది తెగ వైరల్ అయిపోయింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'బంగార్రాజు' మూవీని అక్కినేని స్టూడియోస్ బ్యానర్ సమర్పణలో జీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. నాగ చైతన్యకు జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో దేవలోకంలో రంభ ఊర్వశి మేనకల పాత్రలు కూడా ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక, దీన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టీజర్‌లో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X