For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA Elections : నాగార్జున బర్త్ డేని కూడా వదలని ప్రకాష్ రాజు.. భలే ప్లాన్ వేశాడే!

  |

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం వాడీవేడిగా సాగుతోంది. ఒక రకంగా ప్రతి సారి జరిగే ఎన్నికల కంటే ఈ ఎన్నికలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి అని చెప్పక తప్పదు. దానికి కారణం ఏకంగా ఆరుగురు ఈసారి బరిలోకి దిగబోతూ ఉండడమే. ఒకరి మీద ఒకరు ఇప్పటికే ఆరోపణలు గుప్పించుకునే పరిస్థితి అయితే నెలకొంది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

  తేదీ ఖరారు కావడంతో

  తేదీ ఖరారు కావడంతో

  టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు గాను మా క్రమశిక్షణ సంఘం తేదీ ఖరారు చేసింది.. దీనికి సంబంధించి ఇప్పటికే మా సభ్యులకు నరేష్ నుంచి అధికారిక సమాచారం కూడా అందించారు. ఇక దాదాపుగా తేదీ కూడా ప్రకటించడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొనబోయే వారు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించారు..

  ఏకంగా ఆరుగురు బరిలోకి

  ఏకంగా ఆరుగురు బరిలోకి

  అయితే ప్రధాన పోటీ మాత్రం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఉండే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, నటి హేమ, జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహారావు, కాదంబరి కిరణ్ అధ్యక్ష పోటీలో ఉన్నట్లు ప్రకటన చేయగా ప్రకాష్ రాజు అయితే ఒక అడుగు ముందుకేసి మరీ తన ప్యానెల్ సభ్యులు జాబితా కూడా విడుదల చేశారు.. అంతేకాక తనకి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయని ముందు నుంచి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు.

  నాగ్ బర్త్ డే బ్యాష్

  నాగ్ బర్త్ డే బ్యాష్


  అందుకు తగ్గట్లుగానే నాగబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్ కి మద్దతుగా ప్రచారం కూడా చేయడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ మా ఎన్నికల విషయంలో ఏ పరిణామాన్ని వదిలేయడానికి ఇష్టంలేని ప్రకాష్ రాజు ఈ రోజు నాగార్జున పుట్టిన రోజు కావడంతో నిన్న రాత్రి పెద్ద ఎత్తున భారీగా ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిపారని తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఏడు గంటలకు ప్రకాష్ రాజ్ ఆఫీసులో ఈ వేడుకలు ప్రారంభం అయి ఘనంగా జరిగాయి అని అంటున్నారు.

  బయటకు వచ్చేది కాదు కానీ

  బయటకు వచ్చేది కాదు కానీ

  సాధారణంగా అయితే ఈ విషయం బయటకు వచ్చేది కాదు కానీ గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న సమీర్ తన సహ నటులు, మిగతా అన్ని సీజన్ల బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఈ బర్త్డే పార్టీకి హాజరు కావాలని మెసేజులు పంపడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే తనకు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ ఉంది కాబట్టి మిగతా హీరోల అభిమానులు వారికి మద్దతు తెలిపే నటీనటుల సహకారం కూడా తీసుకునేందుకు ప్రకాష్ రాజ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

  MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
  భలే ప్లాన్ వేశారే

  భలే ప్లాన్ వేశారే

  అలా అందరి హీరోలకు మద్దతు ఉండే నటీనటులతో సఖ్యంగా మెలుగుతూ ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అంటున్నారు. ఇలా మా సభ్యులందరినీ ప్రసన్నం చేసుకునేందుకు ప్రకాష్ రాజ్ ఇలా విభిన్నమైన పద్ధతుల్లో ముందుకు వెళుతుంటే మిగతా పోటీదారులు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్టు కనిపించడం లేదు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

  English summary
  Prakash Raju planned Nagarjuna birthday celebrations at his office on 28th August with bigg boss contestants.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X