నాగార్జున అక్కినేని రెమ్యునరేషన్ అన్ని కోట్లా? పారితోషికం తెలిస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే?
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్ సినిమాలతో పాటుగా మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ కూడా బాగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇలా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలు అనేక భాషల్లో పడుతున్నాయి. దీనితో ఒకో ఇండస్ట్రీకి చెందిన హీరోలు మరో ఇండస్ట్రీలో మార్కెట్ ని కూడా పెంచుకుంటూ వెళుతున్నారు. ఇలా మూవీ లవర్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ బిగ్ స్క్రీన్స్ పై వస్తుంది.
మరి గత ఏడాది లోనే క్రేజీ ట్రీట్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్" అనే సినిమాతో అందించిన సంగతి తెలిసిందే. తాను సహా మలయాళ సినిమా నుంచి మోహన్ లాల్, కన్నడ సినిమా నుంచి నటుడు శివ రాజ్ కుమార్ లాంటి వారి కలయికలో వచ్చి భారీ హిట్ అయ్యి ఫ్యాన్స్ కి మంచి ఊపు తీసుకొచ్చింది. అయితే మళ్ళీ ఇదే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న తాజా రెండు సినిమాలు కూడా భారీ మల్టీ స్టారర్స్ గా వస్తున్నాయి.

వీటిలో ఒకటి వేట్టైయన్ కాగా మరో చిత్రం తమిళ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ తెరకెక్కిస్తున్న చిత్రం "కూలీ" మరొకటి. అయితే లోకేష్ కనగరాజ్ సినిమాల్లో నటీనటుల ఎంపిక ఎంత పక్కాగా ఉంటుందో తెలిసిందే. ఇదే రకంగా ఇప్పుడు కూలీ సినిమాకి కూడా సౌత్ నుంచి చాలా మంది పేరు మోసిన నటీనటుల పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి.
తమిళ్ నుంచి శృతి హాసన్, కన్నడ నుంచి ఉపేంద్ర మన తెలుగు సినిమా నుంచి కింగ్ నాగార్జున లాంటి వారి అడిషన్స్ తో ఇప్పుడు కూలీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా మన తెలుగు ఆడియెన్స్ లో నాగార్జున ఎంట్రీతో మంచి బజ్ జెనరేట్ కాగా ఇప్పుడు ఈ సినిమాకి నాగార్జున అందుకుంటున్న రెమ్యునరేషన్ వింటే షాక్ అవుతారు అని చెప్పాలి.

ఈ చిత్రంలో నాగార్జున చేస్తున్న కేవలం గెస్ట్ రోల్ కే ఏకంగా 24 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారు అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇది తెలుగులో తన స్ట్రైట్ సినిమాల కంటే కూడా అత్యధికం అని చెప్పాలి. తెలుగులో నాగార్జున మార్కెట్ ఏంటి అనేది అందరికీ ఒక ఐడియా ఉంది. హిట్ టాక్ పడితే నాగ్ సినిమాలు దగ్గరగా 50 కోట్ల లోపే మార్కెట్ చేస్తాయి. సో తన రెమ్యునరేషన్ కూడా తెలుగులో అంతంత మాత్రంగానే ఉంటుంది.
కానీ కూలీ లాంటి సినిమాలో తన డిమాండ్ ఉంది కాబట్టి తాను కూడా గట్టిగానే డిమాండ్ చేశారట. దీనితో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు అంత మొత్తం ఇచ్చే సినిమాలోకి తీసుకున్నారని టాక్. అయితే తమిళ సినిమాల్లో రెమ్యునరేషన్స్ కోసం నిర్మాతలు పెద్దగా ఆలోచించరనే టాక్ ఉంది. అందుకే అక్కడ హీరోలకే ఈజీగా 100 కోట్లకి పైగా రెమ్యునరేషన్ లు ఇస్తారు. సో నాగ్ కి కూడా ఈ రేంజ్ లో ఇచ్చినా ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి. ఇక కూలీ సినిమాలో నాగార్జున సైమన్ గా కనిపించనుండగా లోకేష్ కనగరాజ్ తన రోల్ ని స్వాగ్ తో డిజైన్ చేసినట్టుగా వినికిడి.


Click it and Unblock the Notifications











