Agent: చివరి నిమిషంలో అఖిల్ కీలక నిర్ణయం.. ఏజెంట్ గెస్టుగా స్టార్ హీరో
చిన్న వయసులోనే 'సిసింద్రి'గా ప్రేక్షకులను అలరించి.. 'అఖిల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. అయితే, ఈ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన అతడు.. ఆ తర్వాత కూడా కొన్ని పరాజయాలను మూటగట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంతో మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి యమ జోష్‌తో కనిపిస్తోన్న అఖిల్.. ఇప్పుడు 'ఏజెంట్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. దీనిపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి అక్కినేని అఖిల్ చేసిన చిత్రమే 'ఏజెంట్'. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో ఆలస్యం అయింది. దీంతో ఈ మూవీని ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఈ సినిమా హడావిడే కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.
'ఏజెంట్' మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 23న (ఆదివారం) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. దీన్ని వరంగల్‌లోని రంగలీలా మైదానంలో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించబోతున్నారు.
దీనికి RRR హీరోలు గెస్టులుగా వస్తారని అనుకున్నా అలా జరగలేదు. దీంతో చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్న అఖిల్ అండ్ టీమ్.. ఈ ఈవెంట్‌కు కింగ్ అక్కినేని నాగార్జునను ముఖ్య అతిథిగా తీసుకు వస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే 'ఏజెంట్'. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ నటించింది. మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ కథను ఇచ్చాడు. హిప్‌హాప్ తమీజా దీనికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











