అన్నపూర్ణ స్టూడియోలోని రాధేశ్యామ్ సెట్‌లో అగ్ని ప్రమాదం.. నాగార్జున క్లారిటీ
అన్నపూర్ణ స్టూడియో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసి పడుతున్న మంటలు అంటూ నేటి ఉదయం నుంచి వార్తలు జోరందుకున్నాయి. అయితే ఆ మంటల కంటే వార్తలే దావానంలా వ్యాపించాయి. తెలుగు మీడియాలో ఈ వార్తలు ప్రముఖంగా వైరల్ అయ్యాయి. ఇక క్షణాల్లో సోషల్ మీడియాలో విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి. అన్న పూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం, బిగ్ బాస్ షోకు ఆటంకం అంటూ హెడ్డింగులో వార్తలు హల్చల్ చేశాయి.
అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లోనే బిగ్ బాస్ సెట్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో దాని కొంచెం దూరంలోనే ఉన్న ఓ సెట్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని తెలుస్తోంది. అయితే అది రాధేశ్యామ్ చిత్రం కోసం వేస్తోన్న సెట్ అని సమాచారం. ఆ సెట్‌లోనే చిన్న అగ్ని ప్రమాదం జరిగిందట. అయితే వార్తల్లో మాత్రం భారీ అగ్ని ప్రమాదం, ఎగిసి పడుతున్న మంటలు అంటూ వార్తలు రావడంపై నాగార్జున ఫైర్ అయ్యాడు.

ఈ మేరకు అన్నపూర్ణ స్డూడియోలో భారీ అగ్ని ప్రమాదం అనే వార్తలను ఖండించాడు. ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.. ఎవ్వరూ ఆందోళన చెందకండి.. అవన్నీ తప్పుడు వార్తలే.. అంతా బాగానే ఉంది అంటూ ఓ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి అన్నపూర్ణ స్టూడియో మాత్రం ఇలా వార్తల్లో నిలిచింది. దాంతో బాటు గాలి అంతా బిగ్ బాస్ షో వైపు మళ్లింది. ప్రస్తుతం నాగ్ ప్రకటనతో అంతా చల్లబడింది.


Click it and Unblock the Notifications











