వెల్లువెత్తుతున్న విరాళాలు.. నిజంగానే ‘కింగ్’ అనిపించుకున్న నాగ్
కరోనా దెబ్బకు దేశమంతా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. ఎక్కడి కార్యకలపాలు అక్కడే నిలిచిపోయాయి. దినసరి కూలీలు, రోజువారి వేతనాలపై ఆధారపడే కార్మికులు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు తారాగణం ముందుకు వస్తోంది. ఇప్పటికే చిరంజీవి, వివి వినాయక్, దగ్గుబాటి కుటుంబం, మహేష్ బాబు వంటి వారు ఆర్థిక సాయాన్ని ప్రకటించి మంచి మనసును చాటుకున్నారు. తాజాగా కింగ్ నాగార్జున సైతం సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

చిరు కోటి విరాళం..
కొంతమంది సినీ హీరోలు కరోనాతో పోరాడేందుకు ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మొదటగా నితిన్ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 20 లక్షల రూపాయలను అందజేశాడు. అనంతరం పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలే కాక స్టార్ డైరెక్టర్స్ సైతం ముందుకు వచ్చారు. వీరంతా ప్రభుత్వాలకు విరాళాన్ని ప్రకటిస్తే.. చిరంజీవి మాత్రం సినీ కార్మికులను ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

దగ్గుబాటి వారు కోటి..
టాలీవుడ్‌లో మరో పెద్ద ఫ్యామిలీ అయిన దగ్గుబాటి వారు సినీ కార్మికులను ఆదుకునేందుకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులను ఆదుకునేందుకో కోటి రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు రానా, వెంకటేష్, సురేష్ బాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తోటీ నటీనటులకు మహేష్ బాబు పిలుపు..
సినీ కార్మికులను ఆదుకునేందుకు మహేష్ బాబు సైతం ఓ చేయి వేశాడు. అంతకుముందు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కోటి రూపాయల సాయాన్ని ప్రకటించగా.. తాజాగా సినీ శ్రామికుల కోసం రూ. 25 లక్షల విరాళాన్ని అందించాడు. ఇలాంటి కఠిన సమయంలో సాయం చేయండని తోటీ నటీనటులకు పిలుపునిచ్చాడు.
Recommended Video

కింగ్ అనిపించుకున్న నాగ్..
టాలీవుడ్ కింగ్ అని పిలుచుకునే నాగార్జున సైతం.. సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. 21 రోజుల లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారి సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి మంచి మనసును చాటుకుని కింగ్ అనిపించుకున్నాడు.


Click it and Unblock the Notifications











