twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెల్లువెత్తుతున్న విరాళాలు.. నిజంగానే ‘కింగ్’ అనిపించుకున్న నాగ్

    |

    కరోనా దెబ్బకు దేశమంతా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. ఎక్కడి కార్యకలపాలు అక్కడే నిలిచిపోయాయి. దినసరి కూలీలు, రోజువారి వేతనాలపై ఆధారపడే కార్మికులు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు తారాగణం ముందుకు వస్తోంది. ఇప్పటికే చిరంజీవి, వివి వినాయక్, దగ్గుబాటి కుటుంబం, మహేష్ బాబు వంటి వారు ఆర్థిక సాయాన్ని ప్రకటించి మంచి మనసును చాటుకున్నారు. తాజాగా కింగ్ నాగార్జున సైతం సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

    చిరు కోటి విరాళం..

    చిరు కోటి విరాళం..

    కొంతమంది సినీ హీరోలు కరోనాతో పోరాడేందుకు ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మొదటగా నితిన్ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 20 లక్షల రూపాయలను అందజేశాడు. అనంతరం పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలే కాక స్టార్ డైరెక్టర్స్ సైతం ముందుకు వచ్చారు. వీరంతా ప్రభుత్వాలకు విరాళాన్ని ప్రకటిస్తే.. చిరంజీవి మాత్రం సినీ కార్మికులను ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

    దగ్గుబాటి వారు కోటి..

    దగ్గుబాటి వారు కోటి..


    టాలీవుడ్‌లో మరో పెద్ద ఫ్యామిలీ అయిన దగ్గుబాటి వారు సినీ కార్మికులను ఆదుకునేందుకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులను ఆదుకునేందుకో కోటి రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు రానా, వెంకటేష్, సురేష్ బాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

    తోటీ నటీనటులకు మహేష్ బాబు పిలుపు..


    సినీ కార్మికులను ఆదుకునేందుకు మహేష్ బాబు సైతం ఓ చేయి వేశాడు. అంతకుముందు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కోటి రూపాయల సాయాన్ని ప్రకటించగా.. తాజాగా సినీ శ్రామికుల కోసం రూ. 25 లక్షల విరాళాన్ని అందించాడు. ఇలాంటి కఠిన సమయంలో సాయం చేయండని తోటీ నటీనటులకు పిలుపునిచ్చాడు.

    Recommended Video

    Naarappa Movie Intresting Update | Victory Venkatesh | Priyamani
    కింగ్ అనిపించుకున్న నాగ్..

    కింగ్ అనిపించుకున్న నాగ్..


    టాలీవుడ్ కింగ్ అని పిలుచుకునే నాగార్జున సైతం.. సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. 21 రోజుల లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారి సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి మంచి మనసును చాటుకుని కింగ్ అనిపించుకున్నాడు.

    English summary
    nagarjuna Donates One Crore To Film Workers In Lockdown Crisis. lockdown is a harsh reality and a necessity. Appreciating the response from my colleaguesFolded handsI am Donating an amount of Rs 1 Crore for now as my bit for the well being of daily wages Film workers during this Coronacrisis. May god bless us. StayHomeStaySafe
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X