కేవలం హీరోయిన్లకే కాదు.. నాగార్జునకూ తప్పడం లేదు.. సెన్సేషన్ అవుతున్న ఇష్యూ

Recommended Video

Bigg Boss Telugu 3 : Nagarjuna Facing Trolling Before Starting #Biggbosstelugu3

నేటితరం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనే అంశం బాగా పాపులర్ అయింది. నెటిజన్లకు, సెలెబ్రెటీలకు మధ్యదూరాన్ని అమాంతం తగ్గించేసిన సోషల్ మీడియా కొన్ని సందర్భాల్లో హీరోహీరోయిన్లకు లేని తలనొప్పి తెచ్చిపెడుతోంది. గతంలో ఎప్పుడో ఏదో సందర్భంలో చెప్పిన విషయాలను నేటి సిచ్యువేషన్‌కి బదలాయిస్తూ ట్రోల్స్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఈ మధ్యనే గాయని చిన్మయి ఇలాగే అబాసుపాలవగా.. ఇప్పుడు నాగార్జునకూ ఆ పరిస్థితి తప్పడం లేదు. ఇంతకీ అసలు విష్యం ఏంటి? నాగార్జునను ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? వివరాల్లోకి పోతే..

బిగ్ బాస్ సీజ‌న్ 3 హోస్ట్‌గా నాగార్జున

బిగ్ బాస్ సీజ‌న్ 3 హోస్ట్‌గా నాగార్జున

దశాబ్దాల కాలంగా వెండితెరపై రాణిస్తూ.. మొన్నామధ్య మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా బుల్లితెరపై కూడా టాలెంట్ చూపించారు నాగార్జున. ఈ సక్సెస్ చూసిన స్టార్ మా యాజమాన్యం బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్‌గా నాగార్జునను ఫైనల్ చేసిందట. గత రెండు సీజన్లలో ఎన్టీఆర్, నానిలు బిగ్ బాస్ ఆడియన్స్‌లో ఫుల్ జోష్ నింపారు. ఇప్పుడా బాధ్యత నాగార్జునపై పడిందని సమాచారం.

 తెలుగు 'బిగ్ బాస్ 3' హడావుడి

తెలుగు 'బిగ్ బాస్ 3' హడావుడి

జులై మూడో వారంలో తెలుగు 'బిగ్ బాస్ 3' ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటినుంచే పలు ప్రోమోలు విడుదల చేస్తూ 'బిగ్ బాస్ 3' హడావుడి మొదలు పెట్టేశారు నిర్వాహకులు. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలో నాగార్జున కనిపిచనప్పటికీ, రాబోయే ప్రోమోలో నాగార్జున దర్శనమీయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయనపై ప్రోమో షూట్స్ జరుగుతున్నాయని వినికిడి.

అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ.. కానీ

అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ.. కానీ

'బిగ్ బాస్ 3' హోస్ట్ నాగార్జున చేయబోతున్నాడు అనే వార్త అక్కినేని అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. కానీ ఇదే అంశం నాగార్జునకు కొన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. ఒకానొక సమయంలో బిగ్ బాస్ రియాలిటీ షో పై నాగార్జున చేసిన కామెంట్లను బయటకు తీసి ఆయన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు.

నాని హోస్ట్‌గా చేస్తున్న సందర్భంలో

నాని హోస్ట్‌గా చేస్తున్న సందర్భంలో

బిగ్ బాస్ సీజన్ 2 లో నాని హోస్ట్ గా చేస్తున్న సందర్భంలో ఆ షోపై నాగార్జున కొన్ని విమర్శలు చేశాడు. బిగ్ బాస్ షో కాన్సెప్ట్ తనకు కాన్సెప్ట్ అస‌లు నచ్చదని, కొంద‌రిని ఓ ఇంట్లోకి పంపించి వాళ్లేం చేస్తున్నారో దొంగ‌చాటుగా చూడ‌టం.. ఆపై ఆనందం పొంద‌డం అనేది చాలా దారుణమైన చర్య అని సంచలన కామెంట్స్ చేశాడు నాగార్జున.

అదే అసలు తలనొప్పి

అదే అసలు తలనొప్పి

అప్పుడు మాట్లాడిన ఆ మాటలే ఇప్పుడు నాగార్జునకు అసలు తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఆ రోజు బిగ్ బాస్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన మీరు.. ఇప్పుడు అదే షోకు హోస్టుగా ఎలా వెళ్తున్నారంటూ నెటిజన్లు నాగార్జునపై ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. అంతేకాదు అప్పట్లో నాగార్జున చేసిన విమర్శల తాలూకు వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నాగార్జునను కామెంట్ చేస్తున్నారు కొందరు. అయితే ఇప్పటివరకైతే బిగ్ బాస్3 హోస్ట్ నాగార్జున అనే విషయం అఫీషియల్‌గా ప్రకటించబడక పోవడం గమనించదగిన విషయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X