Bigg boss Telugu 5 Launching day TRP: ఈసారి రేటింగ్ విషయంలో డౌన్.. మరీ ఇంత తక్కువనా?
బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. మిగతా రోజులు షో ఎంత ఆసక్తిగా కొనసాగిన కూడా ఎక్కువగా లాంచ్ ఎపిసోడ్ పై వచ్చే రేటింగ్ పైనే అందరి ఫోకస్ ఉంటుంది. అంతేకాకుండా ఫైనల్ ఎపిసోడ్ కూడా స్పెషల్ గెస్ట్ ఎవరు అని ఎవరు వస్తారు అనేదానిపై కూడా రేటింగ్ ఆధారపడి ఉంటుంది. ఇక వీలైనంత వరకు బిగ్ బాస్ షో అయితే రేటింగ్ విషయంలో ప్రతి సారి మొదట్లోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటోంది. అయితే ఈసారి కూడా ఫస్ట్ ఎపిసోడ్ కు నెవర్ బిఫోర్ ఎలా రేటింగ్స్ అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ విషయంలో ఎవరూ ఊహించని విధంగా చాలా తక్కువ రేటింగ్ రావడం విశేషం.

మంచి ట్రాక్ సెట్ చేసిన తారక్
బిగ్ బాస్ షో అసలు తెలుగులో క్లిక్కవుతుందో లేదో అనే అనుమానాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వివాదాస్పదమైన రియాలిటీ షో జనాల్లోకి ఎక్కదు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ నిర్వాహకులు మాత్రం చాలా తెలివిగా మెల్లమెల్లగా జనాల్లోకి షోను ఎక్కించే ప్రయత్నం చేశారు. మొదట్లోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోను హోస్ట్ గా చేసి షోకి ఒక మంచి ఒక ట్రాక్ ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే అప్పట్లో లాంచ్ ఎపిసోడ్ కు 16.18 టిఆర్పి రావడం విశేషం.

రెండవ సీజన్ తో..
బిగ్ బాస్ సీజన్ వన్ హోస్టింగ్ చేసిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రెండవ సీజన్ కు కూడా కొనసాగుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదు. నిర్వాహకులు కూడా ఎన్టీఆర్ ను అస్సలు వదులుకోవద్దు అని అనుకున్నారు. మరికొంత రెమ్యునరేషన్ పెంచడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒప్పుకోలేదు మొత్తానికి నానిని రంగంలోకి దింపారు. నాని మొదలుపెట్టిన రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ 15.05 టిఆర్పి దక్కింది.

అత్యధిక TRP..
ఇక నాని కూడా డా రెండవ సీజన్ కి చేతులు ఎత్తివేయడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తరువాత చాలా మంది హీరోలను సంప్రదించారు. ఇక ఫైనల్ గా నాగార్జున అందుకు సిద్ధం అవ్వడంతో గ్రాండ్ గా మూడవ సీజన్ ను మొదలు పెట్టారు. బిగ్ బాస్ సీజన్ 3కి 17.92 టిఆర్పి దక్కింది. ఇక ఆ తర్వాత కూడా మళ్లీ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ కు 18.5 టిఆర్పి దక్కింది. బిగ్ బాస్ లాంచ్ చరిత్రలో అదే అత్యధిక టిఆర్పి కావడం విశేషం.
Recommended Video

ఐదవ సీజన్ కు తక్కువ రేటింగ్
ఈసారి కూడా ఐదవ సీజన్ కు మొదటి ఎపిసోడ్ తోనే బిగ్ బాస్ షో రికార్డులను క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. ముందుగానే బిగ్ బాస్ నిర్వాహకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. లాంచ్ వేడుక కోసమే దాదాపు రెండున్నర కోట్ల వరకు ఖర్చు చేశారని కూడా టాక్ వచ్చింది. అయితే బిగ్ బాస్ ఫైనల్ ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేసినప్పటికీ కూడా రేటింగ్ విషయంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ కాలేదు.
చాలా తక్కువగా 15.7 టిఆర్పి దక్కడం విశేషం. నాగార్జున లాంచ్ హోస్టింగ్ లో ఇదే అత్యధిక రేటింగ్ అని చెప్పవచ్చు. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ల విషయంలో లో కాస్త నిరుత్సాహ పరిచింది అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ముందే ఆ లిస్ట్ లీక్ కావడంతో ఈసారి అంతగా హైప్ క్రియేట్ కాలేకపోయింది. మరి ఫైనల్ వరకు బిగ్ బాస్ సీజన్ 5 ఎలాంటి రేటింగ్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











