twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nagarjuna :ఇష్టం ఉండదు కానీ, ఏడ్చేలా చేశావ్.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అదొక్కటి చేయండి!

    |

    అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈనెల 24వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే మొదటి ఆట నుంచి మంచి కలెక్షన్లు రాబడుతూ సినిమా సూపర్ హిట్ టాక్ తో అవుతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28 వ తారీఖున ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ కి నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో నాగార్జున కొన్ని ఆసక్తికర కామెంట్ చేశారు ఆ వివరాల్లోకి వెళితే

    దాన్ని ముందు సెలబ్రేట్ చేసుకోవాలి

    దాన్ని ముందు సెలబ్రేట్ చేసుకోవాలి


    ఇది లవ్ స్టోరీ సక్సెస్ మీట్ అనే కంటే ఒక హ్యుమానిటీ సక్సెస్ మీట్ అనిపిస్తోందని నాగార్జున చెప్పుకొచ్చారు. మార్చి 2020 నుంచి కరోనా మహమ్మారి తో పోరాడుతున్నామని దాదాపు సంవత్సరంన్నర దాటేసింది అని ఆయన అన్నారు. ఒకవేళ అయ్యాక బయట పడ్డామని అనుకుంటే సెకండ్ కూడా వచ్చిందని మళ్లీ పూర్తిగా అణచివేసే ప్రయత్నం చేసిందని అన్నారు. కరోనాతో పోరాటం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరెక్ట్ సమయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుని పోరాటంలో ముందున్నారని నాగార్జున పేర్కొన్నారు. 208 రోజుల తర్వాత తెలంగాణలో కోవిడ్ డెత్స్ లేవని తెలిసి సంతోషించానన్న నాగార్జున ఏపీతో పాటు దేశంలోనూ కరోనా తగ్గుతోంది కాబట్టి మనం దాన్ని ముందు సెలబ్రేట్ చేసుకోవాలన్నారు.

    నీ మానవత్వం సూపర్బ్

    నీ మానవత్వం సూపర్బ్

    ఇక లవ్ స్టోరీ సక్సెస్ గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదన్న నాగార్జున ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు మొత్తం దేశ సినిమా పరిశ్రమకే ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. లవ్ స్టోరీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ 7 కోట్ల రూపాయలు అంటే ఒక మంచి సినిమా ఇస్తే థియేటర్లకు వస్తామని తెలుగు్ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని మళ్ళీ చాటి చెప్పారని అన్నారు. కోవిడ్ ఒక్కటే కాదు తుఫాన్, సైక్లోన్ వచ్చినప్పుడు కూడా మన వాళ్లు సినిమాలను ఆదరించారని అన్నారు. ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి మనం సంస్కారం నేర్చుకోవాలని ఎందుకంటే ఆయన పేరు పేరునా టీమ్ అందరికీ థాంక్స్ చెప్పారని, మేము సక్సెస్ కిక్ తో అంతా మర్చిపోతాం కానీ నీ మానవత్వం సూపర్బ్ అంటూ చెప్పుకొచ్చారు.

    ఇష్టం ఉండదు కానీ

    ఇష్టం ఉండదు కానీ

    ఇక లవ్ స్టోరీ ఊరికే హిట్ అవలేదన్న ఆయన అన్ని సినిమాలో ప్రతి సన్నివేశం బ్యూటిఫుల్ గా ఉందని సినిమాకి ఏవేవో లొకేషన్స్ వద్దు ఒక టెర్రస్ చాలు మంచి సినిమా చేసేందుకు అని శేఖర్ కమ్ముల నిరూపించారని అన్నారు. ఇక తనకు ఇలాంటి ఇన్సిడెంట్స్ చదవడం కూడా ఇష్టం ఉండదు కానీ అలాంటి అంశాలను శేఖర్ కమ్ముల చూపించిన విధానం సూపర్బ్ అని, నేను సినిమా చూసి రెండు మూడు రోజులు అదే ఎమోషన్ లో ఉండిపోయానని అన్నారు. ఇక పవన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారన్న నాగార్జున ఆయన ఏఆర్ రెహమాన్ గారి శిష్యుడు అని విన్నాను. అందుకే వందలాది మిలియన్ వ్యూస్ వచ్చాయి. వెల్ డన్ పవన్ అని అన్నారు. ఇక సుద్దాల సాహిత్యం, మంగ్లీ పాటలు పాడిన తీరు బ్యూటిఫుల్ గా ఉందని అన్నారు.

    ఏడ్చేలా చేశావ్

    ఏడ్చేలా చేశావ్

    సినిమాకు పనిచేసిన సాయి పల్లవి వండర్ ఫుల్ యాక్ట్రెస్ అని ఆమె డాన్స్ చేస్తుంటే ఒక స్పిరిట్ కనిపిస్తుంటుందని ఆమె చుట్టూ వంద సాయి పల్లవిలు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. ఆమె కాళ్లు గాలిలో తేలినట్లు ఉంటాయని అన్నారు. ఇక వ్వు ఏ క్యారెక్టర్ చేసినా ఆ మ్యాజిక్ కనిపిస్తుంటుంది. నీకు అది గొప్ప గిఫ్ట్ అని అన్నారు. ఇక చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుందన్న నాగ్ ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసిందని, యాక్టర్ అండ్ స్టార్ ఇవి రెండు డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్ గా తయారు చేశావ్ శేఖర్ కమ్ముల, అతన్ని న్యూ జర్నీలో తీసుకెళ్లావ్. నాన్నా...నువ్వు చాలా ఫెంటాస్టిక్ గా నటించావు. నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్ సినిమాలో అంటూ ప్రేమ కురిపించారు.

    Recommended Video

    #BiggBossTelugu5 : Lobo, Nataraj Master Lost It Completely || Filmibeat Telugu
    ప్రభుత్వాలను ఇదే కోరుతున్నా

    ప్రభుత్వాలను ఇదే కోరుతున్నా

    ఇక ప్రేమనగర్ రిలీజ్ అయి 50 ఏళ్లవుతోందన్న నాగ్ సేమ్ డేట్ కు లవ్ స్టోరి రిలీజ్ అయ్యిందన్నారు. ప్రేమనగర్ టైమ్ లోనూ తుఫాన్ సైక్లోన్ అన్నీ ఉన్నా, నాన్నగారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యిందని ఇప్పుడు కూడా అలాగే తుఫాన్, కొవిడ్, సైక్లోన్ తో పోరాడి లవ్ స్టోరి గొప్ప విజయాన్ని సాధించిందని అన్నారు. ఇక చివరిగా ముగించే ముందు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఒక విషయం కోరుతున్నానని పేర్కొన్న నాగార్జున మమ్మల్ని ఎప్పుడూ చల్లగా మంచి చూపుతో చూశారని అన్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాని చాలా చల్లటి చూపుతో చూశారని అందుకే మీరు కూడా మీ ప్రభుత్వాల ఆశీర్వాదాలు మాకు ఇవ్వాలని కోరారు. నేను కోరుకునేది అదే అని పేర్కొన్న నాగార్జున మనమందరం ఎప్పుడు ఈ మాస్కులు లేకుండా షేక్ హ్యాండ్ ఇచ్చాక కూడా చేతులు కడుక్కోకుండా ఉండే రోజు వస్తుందని ఎదురు చూస్తున్నా అని అన్నారు.

    English summary
    Nagarjuna made some interesting comments at the love story success meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X