మన్మథుడు 2: యూనిట్ అందరి గురించి చెప్పేసిన నాగార్జున

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన తాజా చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) నిర్మించిన ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. లక్ష్మి, వెన్నెలకిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

మన్మథుడు 2.. అంతా ఎలాంటి వారంటే

మన్మథుడు 2.. అంతా ఎలాంటి వారంటే

ఇన్ని రోజులు దేశ విదేశాల్లో పర్యటిస్తూ మన్మథుడు 2 సినిమా సెట్స్ పై సరదా సరదాగా ఎంజాయ్ చేసిన నాగార్జున తాజాగా యూనిట్ అందరి గురించి ఒకే వీడియో ద్వారా చెప్పేశాడు. మన్మథుడు 2 టీం అంతా ఎలాంటి వారంటే.. అంటూ ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా వివరించాడు నాగార్జున. నటీనటులు మొదలుకొని సాంకేతిక వర్గం వరకూ అందరి గురించి చెప్పాడు.

 అంతా అయిపోయింది.. నిర్మాతను అయినప్పటికీ అదే ఫీలింగ్

అంతా అయిపోయింది.. నిర్మాతను అయినప్పటికీ అదే ఫీలింగ్

చాలా సరదాగా సినిమా కంప్లీట్ చేశాం. అసలు సినిమా ఇన్ని రోజులు పట్టింది.. ఇలా జరిగింది అని కూడా అనిపించలేదు. ఈ సినిమాకు నేను నిర్మాతను అయినప్పటికీ ఇంకొన్ని రోజులు సినిమా షూటింగ్ ఉంటే బాగుండేది అనిపించింది. లక్ష్మి గారు (మా అమ్మ), ఝాన్సీ, నిశాంతి, దేవదర్శిని, రావురమేష్ ఈ అందరితో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది అని నాగార్జున అన్నాడు.

చేతన్ భరద్వాజ్, ఆర్ట్ డైరెక్టర్లు, కాస్ట్యూమ్ డిజైనర్స్

చేతన్ భరద్వాజ్, ఆర్ట్ డైరెక్టర్లు, కాస్ట్యూమ్ డిజైనర్స్

Rx 100 సినిమాకు చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం చేసే నేను ఫిదా అయ్యాను. ఈ సినిమాకు చాలా మంచి సంగీతం అందించాడు. ఇంటర్నేషనల్ క్వాలిటీతో సాంగ్స్ రూపొందించాడని అన్నాడు నాగ్. ఆర్ట్ డైరెక్టర్లు సూపర్, కాస్ట్యూమ్స్ అందించిన అనిరుద్, దీపికా భేష్.. ఈ సినిమా కోసం వాళ్ళు సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్స్ నాకెంతో నచ్చాయి అని నాగార్జున పేర్కొన్నాడు.

 ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్, సినిమాటోగ్రాఫర్

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్, సినిమాటోగ్రాఫర్

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగ.. సినిమాకు అన్నీ తానై చూసుకున్నాడు. పోర్చుగల్, స్విట్జర్లాండ్ షెడ్యూల్స్ లో నాగ చాలా బాధ్యతలు మోస్తూ సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. ఇక సినిమాటోగ్రాఫర్ సుకుమార్ సినిమా షూటింగ్‌కి అన్నీ తానై ముందున్నాడు అని చెప్పిన నాగ్ మన్మథుడు 2 యూనిట్ అంతా కలిసి సూపర్ సినిమా మీ ముందుకు తెస్తున్నాం అని చెప్పాడు.

నాగార్జున కాన్ఫిడెన్స్

నాగార్జున కాన్ఫిడెన్స్

ఇక మన్మథుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాటలు చూస్తే ఈ సినిమాపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటో తెలుస్తుంది. ఈ సినిమాతో తన కొడుకు, కోడలికి షాక్ ఇవ్వబోతున్నానని నాగార్జున చెప్పారు. ‘ఈ సమ్మర్‌కి మా పెద్దబ్బాయి ‘మజిలీ' అనే సినిమాతో మీ ముందుకు వచ్చాడు. మొన్న ‘ఓ బేబీ' అంటూ నా కోడలొచ్చింది. రేపు ఆగస్ట్ 9న ఆ రెండింటిని ఫసక్.. అవుట్. నేనొస్తున్నాను' అంటూ ఈవెంట్‌లో సరదాగా మాట్లాడారు నాగ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X