సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య పరిస్థితి అలా.. నాగ్ షాకింగ్ కామెంట్స్
మళ్ళీ చాలా రోజులు తర్వాత తెలుగు సినీ వర్గాల్లో ఓ జంట కోసం ఓ హీరో పెళ్లి కోసం ఆసక్తికరంగా అంతా మాట్లాడుకోవడం జరుగుతుంది మరి వారెవరో కాదు అక్కినేని యువ హీరో నవయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కోసం కాగా తన మాజీ భార్య అలాగే పాన్ ఇండియా హీరోయిన్ అయినటువంటి సమంత కోసం అనే చెప్పాలి. అలాగే ఈ ఇద్దరు విడాకులు తీసుకున్న మూడేళ్ళకి నాగ చైతన్య తన కొత్త భాగస్వామి అంటూ ప్రముఖ నటి శోభితని అనౌన్స్ చేయడం ఒక్కసారిగా వార్తల్లో వైరల్ గా మారింది.
దీనితో మరోసారి నాగ చైతన్య సమంతల విడాకుల కోసం ప్రస్తావన సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో చర్చకి దారి తీయగా అప్పట్లో సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోవడానికి చాలా ఊహించని కారణాలే వైరల్ గా మారాయి. కాగా అప్పట్లో విడిపోయిన కొన్ని రోజులు నెలల సమయంలో ఒకరి కోసం ఒకరు మాట్లాడే ప్రస్తావన వచ్చినపుడు సమంత నాగ చైతన్య విషయంలో పట్టరాని కోపంతో ఊగిపోయేది కానీ నాగ చైతన్య మాత్రం సింపుల్ గా ఆమె లైఫ్ ని తనకిష్టమొచ్చినట్టు ఉండనివ్వండి అన్నట్టుగా తెలిపాడు.

అయితే అసలు విడాకులు తర్వాత నాగ చైతన్య ఎలా ఫీల్ అయ్యాడు? ఎలా ఉండేవాడు అనేది తన తండ్రి టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ఇపుడు ఊహించని విధంగా మారాయి. కాగా నాగ్ రీసెంట్ గా ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ సమంతతో విడాకులు తర్వాత చైతూ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు అని షాకింగ్ నిజాన్ని వెల్లడించారు.
అంటే సామ్ తో విడిపోవడం అనేది నాగ చైతన్యకి ఇష్టం లేదనే చెప్పాలి. అలాగే అప్పుడు డిప్రెస్ అయ్యిన చైతు ఆ విడాకులని అంత ఈజీగా తీసుకోలేకపోయారు అని తెలిపారు. చైతు ఎప్పుడు తనలోని ఫీలింగ్స్ ని ఎప్పుడు పెద్దగా బయటకి చూపించుకోడు కానీ ఒక తండ్రిగా నా కొడుకు ఎలా ఫీల్ అవుతున్నాడో నేను అర్ధం చేసుకోగలిగాను అలా చై చాలా బాధలో ఉన్నాడని అర్ధం అయ్యింది అని తెలిపారు.
కానీ ఇప్పుడు ఈ కొత్త బంధంతో హ్యాపీగా మారడం నాకు సంతోషాన్నిచ్చింది అని నాగ్ రివీల్ చేశారు. ఇపుడు ఎంగేజ్మెంట్ ఎంతో సాఫీగా జరిగింది అని రెండు కుటుంబాలు ఎంతో హ్యాపీగా ఉన్నామని నాగ్ ముగించారు. దీనితో ఇలా సామ్ తో విడాకులు అనంతరం మాత్రం నాగ చైతన్య అంత ఈజీగా తన లైఫ్ ని తీసుకోలేకపోయాడు అనే చెప్పాలి.
కాగా ప్రస్తుతం నాగ చైతన్య తన కెరీర్ భారీ చిత్రం "తండేల్" చేస్తుండగా ఈ సినిమాతో తాను కూడా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు కార్తికేయ సిరీస్ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తుండగా సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాని గీతా ఆర్ట్స్ వారు బ్యాక్ రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











