9ఏళ్ళ తరువాత విడుదలవుతున్న నాగార్జున సినిమా!
కింగ్ నాగార్జున ఎలాంటి సినిమా చేసినా కూడా ఎంతో కొంత డిఫరెంట్ గా ఉంటుందనే చెప్పాలి. ప్రయోగాత్మకమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఆయన హోస్ట్ గా కూడా సక్సెస్ అయ్యాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు అలాగే బిగ్ బాస్ వ్యాఖ్యాతగా కూడా ఎంతగానో క్రేజ్ అందుకున్నాడు.
అసలు మ్యాటర్ లోకి వస్తే నాగార్జున కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిన సినిమా ఒకటి 9 ఏళ్ల తరువాత విడుదల కాబోతోంది. మన దగ్గర ఆల్ రేడీ రిలీజ్ అయ్యింది. కాకపోతే తమిళ్ లో ఇప్పుడు ఆ సినిమాను భారీ స్థాయిలో డిసెంబర్ 25న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజన్న. K.విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

దర్శకధీరుడు రాజమౌళి కూడా ఆ సినిమాకు పని చేశారు. అందులో అన్ని యాక్షన్ సీక్వెన్స్ లను ఆయనే డైరెక్ట్ చేశారు. తెలంగాణ విప్లవకారుడిగా నాగార్జున ఆ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక కీరవాణి అంధించిన సంగీతం సినిమాకు మంచి క్రేజ్ తెచ్చింది. ఇక సినిమా టీవీలో ఇప్పటికి మంచి రేటింగ్స్ ను అందుకుంటోంది. మరి 9 ఏళ్ళ తరువాత తమిళ్ లో డబ్ అవుతున్న ఈ సినిమా ఏ స్థాయిలోవిజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











