నాగార్జునతో రకుల్ రొమాన్స్‌కు రెడీ.. మన్మధుడు 2 ' మొదలైంది
కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున, పీ కిరణ్ నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'మన్మధుడు 2 ' షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌కు ప్రముఖ మాటల రచయి సత్యానంద్ స్క్రిప్ట్‌ను అందించారు. నాగార్జున సతీమణి అమల అక్కినేని ఫస్ట్‌క్లాప్ ఇచ్చారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేయగా మొదటి షాట్‌ను దేవుని పటాలపై చిత్రీకరించారు. సుమంత్, సుశాంత్, నాగ సుశీల, యార్లగడ్డ సురేంద్ర ఇంకా అక్కినేని కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారం రోజులపాటు హైదరాబాద్ షెడ్యూల్ జరుపుకున్న తర్వాత చిత్ర యూనిట్ పోర్చుగల్ వెళ్తుంది. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.

చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. చి.ల. సౌ చిత్రాన్ని నాగార్జున గారు చూసి మెచ్చుకుని అన్నపూర్ణ ద్వారా రిలీజ్ చేశారు. ఆ చిత్రాన్ని చూసినప్పుడే ఆయన నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నాకు ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు." అన్నారు
నటీనటులు: అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని
స్క్రీన్ ప్లే : రాహుల్ రవీంద్రన్, సత్యానంద్,
డైలాగ్స్ : కిట్టు విస్సప్రగడ, రాహుల్ రవీంద్రన్,
ఎడిటర్స్ : చోట వి ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్స్: ఎస్. రామకృష్ణ, మోనికా నీగోత్రే సబ్బని,
కాస్ట్యూమ్స్ : అనిరుధ్ సింగ్, దీపికా లల్వాని,
డి.ఓ.పి : ఎం.సుకుమార్,
సంగీతం : చైతన్ భరద్వాజ్
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, పి.కిరణ్
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్


Click it and Unblock the Notifications











