Nagarjuna: నాగ చైతన్య, అఖిల్ కి అంత గట్స్ లేవ్... నాగార్జున షాకింగ్ కామెంట్స్..
ప్రసుత్తం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ హవా కొనసాగుతోంది. పాత బ్లాక్‌బస్టర్ సినిమాలను కొత్త టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ట్రెండ్ ఇప్పుడు విపరీతంగా పెరిగింది. తాజాగా అదే జాబితాలో తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన కల్ట్ క్లాసిక్ 'శివ' (Shiva) సినిమా కూడా చేరింది. 1989లో విడుదలై సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ లెజెండరీ మూవీని మళ్లీ ప్రేక్షకుల కోసం 4K అల్ట్రా డిజిటల్ క్వాలిటీతో, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌లో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శివ సీక్వెల్స్ పై రీమేక్ పై నాగార్జున, రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు.
శివ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కలిసి ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. అభిమానులతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. డెరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. "శివ సినిమా కేవలం సినిమా కాదు, అది ఒక విప్లవం. ఆ సినిమాలో చూపించిన నిజాయితీని మళ్లీ రిపీట్ చేయడం కష్టం. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ ఉండదు. ఇది ఒకే ఒక్కటే శివ," అని స్పష్టం చేశారు. నాగార్జున కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, "శివ మన కెరీర్‌లను మార్చిన సినిమా. మళ్లీ దానిని రీ-క్రియేట్ చేయడం సాధ్యం కాదు," అని అన్నారు.

ఈ సందర్భంగా ఒక విలేఖరి "శివ సినిమాను రీమేక్ చేస్తే మీ కుమారుడు నాగచైతన్య (Naga Chaitanya) లేదా అఖిల్ (Akhil Akkineni)లో ఎవరు బాగుంటారు?" అని ప్రశ్నించగా నాగార్జున నవ్వుతూ, "వాళ్లిద్దరికీ ఆ సినిమాను రీమేక్ చేసేంత గట్స్ లేవు. శివ లాంటి సినిమాను మళ్లీ చేయడం అంటే అసాధ్యం" అని సమాధానమిచ్చారు. ఆయన ఈ జవాబు చెబుతూనే అక్కడ ఉన్న అభిమానులు, మీడియా ప్రతినిధులు షాక్ అయ్యారు. ఏంటీ నాగార్జున ఇంతా మాటా అనేశాడని భావించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా "శివ లాంటి సినిమా ఒక్కటే, నాగ్ లాంటి హీరో మరొకడు లేడు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
1989లో విడుదలై 'శివ' (Shiva) తెలుగు సినిమా దిశనే మార్చిన ఈ చిత్రం,దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), హీరోయిన్ అమల ల కెరీర్‌లకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను 4K రీస్టోరేషన్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ తరుణంలో 'శివ' (Shiva) రీ-రిలీజ్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఈ ప్రమోషన్లలో నాగార్జున, ఆర్జీవీ ఇద్దరూ చురుకుగా పాల్గొంటున్నారు. అలాగే.. టాలీవుడ్ స్టార్‌లు ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వీడియో సందేశాల ద్వారా ఈ చిత్రానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా "శివ తెలుగు సినిమాకు నూతన యుగాన్ని తెచ్చిన మాస్టర్‌పీస్" అని పేర్కొంటూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. దీంతో "శివ 4K" రీ-రిలీజ్‌పై అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది.
ఇలా సినీ స్టార్ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో శివ రీ-రిలీజ్‌పై ప్రేక్షకుల్లో ఉత్సాహం ఊపందుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై వంటి నగరాల్లో ఇప్పటికే షోలు హౌస్‌ఫుల్‌గా మారాయి. 36 సంవత్సరాల తర్వాత థియేటర్లలో "శివ" మళ్లీ సందడి చేయబోతోంది.
ఇక నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్టింగ్‌లో బిజీగా ఉన్నారు. అలాగే ఇటీవల విడుదలైన "కుబేర", "కూలీ" వంటి సినిమాల్లో క్యామియో పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే.. తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. దానితో పాటు తన కెరీర్‌లో అత్యంత గుర్తింపు తెచ్చిన 'శివ' రీ-రిలీజ్ తో మరోసారి అభిమానుల్లో గత జ్ఞాపకాలు రగిలించబోతున్నారు. మొత్తానికి, రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కాంబినేషన్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మాయచేయడానికి సిద్ధమైందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











