చైతూ, సామ్ బ్లాక్ బస్టర్ కపుల్.. నాగ్‌కు మజిలీ జోష్
నాగచైతన్య, సమంత అక్కినేని జంటగా నటించిన మజిలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఈ చిత్రంపై తొలుత డివైడ్ టాక్ వచ్చినా.. చివరకు ఫీల్‌గుడ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 17.5 కోట్ల నికర వసూళ్లను సాధించింది. దాంతో అక్కినేని ఫ్యామిలీలో సంతోషం నెలకొన్నది. తన కుమారుడు, కోడలు నటించిన చిత్రం సూపర్ హిట్ కావడంతో నాగార్జున ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

మజిలీ విజయం నేపథ్యంలో నాగార్జున ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మై బ్లాక్ బస్టర్ కపుల్ అంటూ ముగ్గురు కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. నాగార్జున ఫోటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని అభిమానులు లైకుల మీద లైకులు కొట్టడం గమనార్హం.
మజిలీ తర్వాత చైతూ వెంకీ మామ చిత్రంలో, సామ్ ఓ బేబీ, 96 చిత్రాల రీమేక్‌లో నటించనున్నారు. నాగార్జున బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నారు.
majili naga chaitanya samantha divyansha kaushik shiva nirvana nagarjuna మజిలీ నాగ చైతన్య సమంత దివ్యాంన్ష కౌశిక్ శివ నిర్వాణ


Click it and Unblock the Notifications