వైల్డ్ డాగ్ సినిమాకు పోటీగా కార్తీ సినిమా.. ఇష్టం లేదంటూ నాగార్జున షాకింగ్ కామెంట్
ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే తప్పకుండా ఎదో ఒక సినిమాపై ప్రభావం పడుతుంది. కలెక్షన్స్ పరంగా ఎంతో కొంత నష్టమైతే కలుగుతుంది. అందుకే వీలైనంత వరకు పోటీ లేకుండా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ శుక్రవారం రెండు డిఫరెంట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. ఇక నాగార్జున ఆ విషయంపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు.

నమ్మకంతో ఉన్న నాగార్జున
NIA ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం వైల్డ్ డాగ్. ఈ సినిమాపై నాగార్జున చాలా నమ్మకంతో ఉన్నాడు. తీరిక లేకుండా ప్రమోషన్ కూడా చేస్తున్నారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గానే నిర్వహించారు. ఇక ఈవెంట్ లో నాగార్జున మరో సినిమా రిలీజ్ పై కూడా స్పందించాడు.

అదే రోజు కార్తీ సుల్తాన్
వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్ 2న రాబోతోంది. అయితే అదే రోజు రావాల్సిన గోపిచంద్ సీటీమార్ వాయిదా పడగా కార్తీ సుల్తాన్ సినిమా మాత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ట్రైలర్ తోనే కార్తీ మంచి బజ్ అయితే క్రియేట్ చేశాడు.

ఏ మాత్రం ఇష్టం లేదని
అయితే కార్తీ సినిమాతో పోటీ పడటం నాగార్జునకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆ విషయాన్ని డైరెక్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పేశాడు. ఊపిరి సినిమాతో తమ్ముడు అయినటువంటి కార్తీ సుల్తాన్ సినిమా అలాగే తన వైల్డ్ డాగ్ సినిమా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అంటూ.. ఇద్దరి మూవీస్ ఒకే రోజు అలా రిలీజ్ అవ్వడం ఏ మాత్రం ఇష్టం లేదని అన్నారు.

ఆ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని..
అయినప్పటికీ నా తమ్ముడు కార్తీ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్లు నాగార్జున వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకరికి సంబంధించిన సినిమాను మరొకరి ఈవెంట్ లో మాట్లాడడం అరుదు. కానీ నాగార్జున అలాంటి భేదం చూపకుండా సుల్తాన్ సినిమా కూడా హిట్టవ్వాలని కోరుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











