Manmadhudu: నాగార్జున క్లాసిక్ మూవీ రీ రిలీజ్.. త్రివిక్రమ్ మ్యాజిక్ మరోసారి
రీ రిలీజ్.. రీ రిలీజ్.. రీ రిలీజ్.. ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోంది ఇదే. అంతలా గతంలో వచ్చిన సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన ఎన్నో చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది స్టార్లు నటించిన క్లాసిక్ మూవీలను వాళ్ల వాళ్ల పుట్టినరోజులనో, మరో స్పెషల్ డేనో రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో బడా హీరో అక్కినేని నాగార్జున వంతు వచ్చేసింది. ఆయన కెరీర్‌లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన 'మన్మథుడు' మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు.
అక్కినేని నాగార్జున హీరోగా కే విజయ భాస్కర్ తెరకెక్కించిన చిత్రమే 'మన్మథుడు'. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో ఈ సీనియర్ హీరోకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం పెంచేసింది. ఇప్పుడీ సినిమాను నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 29న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు కొన్ని పోస్టర్లను కూడా రిలీజ్ చేసింది.

అక్కినేని నాగార్జున కెరీర్‌లో క్లాసిక్ మూవీగా నిలిచిన 'మన్మథుడు'ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్, ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు, దీన్ని ఏకంగా 300లకు పైగా స్క్రీన్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే ఈ సినిమా 4K ప్రింట్ వర్క్ కూడా పూర్తి అయింది. ఇక, ఈ సినిమా ట్రైలర్‌ను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయబోతున్నారు. దీంతో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.
నాగార్జున హీరోగా నటించిన 'మన్మథుడు' సినిమా 2002లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను, మాటలను అందించాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో బ్రహ్మానందం కామెడీ, పంచ్ డైలాగులు, సాంగ్స్ లవ్ ట్రాక్స్ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడిదే మ్యాజిక్‌ను మరోసారి థియేటర్లలో చూపించబోతున్నారు. ఇక, ఈ చిత్రంలో సొనాలి బింద్రె, అన్షు హీరోయిన్లుగా నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











